తెలిసిన పని ధైర్యముగా చేయడానికి - లోకంతో నీకు పనేముంది
మిత్రమా! బయపడుతున్నావా లేక చేయాలనుకున్న పని నువ్వు చేయడం మొదలు పెడితే నీ చుట్టూ వున్నవారు నిన్ను చూసి నవ్వేసి నిను హేళన చేస్తారేమో అని బ్రమిస్తున్నావా. నీది కానీ నీ పని నువ్వు చేయడం కష్టం అని నువ్వు ఆలోచిస్తున్నావ, అవును నిజమే కదా మరి ఒకరిని చూసి హేళన చేయడం లేదా మొదలుపెట్టిన పనిని ఆదిలోనే నీవల్ల ఏమవుతుంది అవసరమా మనకి ఇలాంటివి పనికి రావు ఇదొక వ్యాపారమో లేక ఐవరో ఒకరి కింద నెలకి ఇంత వచ్చే పిక్కల కోసమో కష్టపడి సంపాదించుకుంటే చాలదా! ఈ పైన రాసిన పదాలు గుర్తుంచుకో మిత్రమా చివరిన మల్లి గుర్తు చేసుకుందాము. అలా మనలని వెనుకకు లాగడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి, అలాంటి ప్రయత్నాలలో నీ కష్టం, నీ కృషి, నీ దైర్యం, నీ కార్యసాధన ఎంత అవేవి నిజాము కావని ఒట్టి మాటలని నిరూపించడానికి.
మిత్రమా నిజంలోకి రా, ఈరోజుల్లో అందరికి ఎరిగినదే డబ్బున్న వాడు డబ్బున్నవాడిలాగానే పోతున్నాడు, లేనివాడు అలానే పోతున్నాడు, మరి మనం ఎంత, " ఎంతలో ఉన్నామో అంతే కదండీ " మనం కూడా అని అనుకుంటున్నారా, ఆపేయ్ ఇక అలంటి ఆలోచనలు నీ చుట్టూ కాదు కదా నీ దరిదాపుల్లో వినిపించినా అన్న గొంతులు మూగబోయేలా ఓ చిరునవ్వు నవ్వేసి నీ కార్య సాధన ఏమిటో ఆ పనిలో పడిపో, ఇంతకీ ఇదంతా ఏంటి పని గురించి మాట్లాడుతూ డబ్బు ఎందుకు ,మధ్యలో ఈ జనాలు ఎందుకు అనుకుంటున్నావా వుంది అన్నిటికి ఒక కారణం ఉంది, ఈ కాలం లో ఒకరు బాగుపడితే నలుగురికి మంచి జరుగుతుంది అనుకునేవారికన్నా, నేను పడితే నాతో మొదలైన వారు మాత్రమే కాకుండా ఆ ఆలోచన వచ్చిన వారు అందరూ నాశనం అవ్వాలి అనుకునే మనస్తత్వాలే ఎక్కువ, అలా అని అందరూ అలా ఉంటారు అని కాదు, అయినా తప్పు నీది కాదులే మిత్రమా, నిజం నేను మాట్లాడేది తప్పు నీది కానే కాదు ఎందుకంటావా భయం నీకు ఏర్పడింది కేవలం నీ చుట్టూ ఉన్న సమాజం వల్లనే కదా, అటువంటి ఈ గొప్ప సమాజంలో మహోత్తరమైన అవసరం లేని మనుషుల గురించి తెలియచెప్తాను, ఇక ఆ తరువాత నిర్ణయం నువ్వే తీసుకో మిత్రమా.
నేటి సమాజం లో గొప్పగా ఎదగాలి అనుకున్న మనిషికి అవసరమైనది, ఒకటి దైర్యం రెండు భరోసా ఇది గుర్తుంచుకో చాలా ముఖ్యం నమ్మకమైన సావాసం చివరాఖరికి చేతికి నాలుగు రాళ్ళ సంపాదన, వీటిల్లో ఏది నీకు దొరకకపోయినా నువ్వు చివరికి గంజి కాదు కదా గొంతు తడుపుకోడానికి కూడా ఏమి మిగిలించదు ఈ సమాజం, అలాంటి సమాజం అనే ఉచ్చు నీకు ఎటువంటి సాయం చేస్తుందని నీ భయం. మిస్టర్ / మిస్ ఇది నువ్వే కదా నిన్ను నిన్నుగా ప్రశ్నించుకో, నీ జీవితం ఎవరికోసం కష్టపడుతున్నావు అనేది. ఈ లోకం అనేది నిన్ను ఎప్పటికి బానిసను చేయడానికే సిద్ధంగా ఉంటుంది, దానికి నువ్వు కూడా సిద్దమై గొర్రెల మంద లో మేకలా తలవంచుకుని నీ చుట్టుపక్కల ఏం అవుతుందో కనీసం అర్ధం చేసుకోకుండా ఉండిపోతావా? లే ఇప్పటికి కూర్చుని నిన్ను నువ్వు ఆపుకున్నది చాలు, నీలో ఉన్న పిరికితనాన్ని పారద్రోలి నువేమి చేయగలవో ఆలోచించడం మొదలుపెట్టు, ఎలా ఏమిటి అనుకుని సతమతమవుతున్నావా, నేను చెప్తా పద ప్రపంచానికి దిగువగా ఉండి పడే బానిసత్వం నీ నుండి ఎలా దూరం చేయాలో, సిద్ధమా మరి మొదలుపెడదామా మన ప్రయాణం.
మిత్రమా, నీది అనుకున్న ఈ ప్రపంచం లో నీ స్థానం ఎక్కడ ఉందొ తెలియక సతమతమవుతున్నావా, అసలు నీ ప్రయాణం ఏమిటి పద తెలుసుకుందాం. నిజమే చిన్ననాటి నుండి నువ్వు వేసే ప్రతి అడుగులో మీ నాన్న గారి ప్రోత్సాహం, వేసే తప్పటి అడుగులో వెనుకేసుకొచ్చే మీ అమ్మ ప్రేమ గుణం ఇవి రెండు నీకు శ్రీరామ రక్షా, ఏ కాదా మనం చేసే పనుల్లోనూ వేసే అడుగులోనూ మనల్ని కన్నందుకు కోటి ఆశలతో మీరు ప్రయోజణాత్మకంగా తయారవుతారని వారికి కలిగిన ఇబ్బందులు పిల్లలుగా పుట్టిన మీకు కలగకూడదని కడుపు కాల్చుకుని, తమ సంతోషాలని వదులుకుని దిన దినం నువ్వు ఎదుగుతూ వారి ముందు నడియాడుతుంటే రాబోయే కాలం లో రేపటి పౌరులకు ఆదర్శప్రాయకంగా నిలుచుంటావని తలిస్తే నువ్వేమో వాడు వీడు అంటూ నీలోని తెలియని భయాన్ని తలమీద పెట్టుకుని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ వచ్చిందే సరితూగునే అని నీ జీవితాన్ని అక్కడికక్కడే నిలిపేసుకుని, నీకు చెప్పుకోవాల్సిన దైర్యం మరెవరికో చెప్పుకునే స్థాయి అవసరమా, మేలుకో మిత్రమా మేలుకో పరులకోసం పడిన కష్టం ఇక చాలు.
అసలు నీ ఆలోచన ఏవిధంగా వుండాలని నువ్వు ఏనాడైనా అనుకున్నావా, ఒక విషయం గురించి మనం ఎంతమందితో మాట్లాడామా అనేది చుస్తున్నామే కానీ అసలు నీకు కావలసిన విషయం గురించి నీకు ఏమాత్రం జ్ఞానం ఉంది అసలు తెలుసుకోవాలన్న ఆలోచన మొదలుపెట్టావా, లేదు కదా, నిజమే ఎందుకంటే నీకన్నా పెద్దవారు నీతో ఉన్నవారు నీకు ఒక విషయం గురించి చెప్తున్నారు అంటే అందులో వారికున్న మిడి మిడి జ్ఞానం మాత్రమే కానీ ఒకరు చేస్తున్న పని గురించి కాకుండా వేరొక దాని గురించి చెప్పడానికి వారికీ తెలియదు నీకు అర్ధం కాదు, అలాంటప్పుడు నీకు నువ్వు ఇంకా ఒకరు చెప్తారు, ఎదుటివారు చెప్పిందే వేదం అనుకుంటే ఇంక నీ గురించి ను ఎప్పుడు ఆలోచన మొదలుపెడతావ్, మిత్రమా నీ చుట్టూ వున్న వారి గురించి ఆలోచించు తప్పులేదు కానీ నీకేమి నిర్ణయం లేకుండా నీకు నువ్వుగా అడుగువేయకుండా ఇంకా ఎంతకాలం ఒకరి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటావు, జ్ఞాపకముంచుకొ నీ చుట్టూ వున్న వారు కేవలం వారు నడిచిన బాట లో వారికి తెలిసిన జ్ఞానం ఎంత సంపాదించారో వారికి తెలిసిన జ్ఞానాన్ని మాత్రమే చెప్పడం జరుగుతుంది అంతే గాని నీకు నీ జీవితం పైన ఏదైనా నమ్మకం ఉన్నదా ఆలోచించు ఒకరి మాట మీద ఆధారపడతావో లేక నీ జ్ఞానం పెంచుకుని నీ జావితానికి ఓ బాట ఏర్పర్చుకుంటావో.
నీ ఆలోచన ఎలా ఉండాలి :
నువ్వు అనే నీ దారిలో నీకంటూ నీ జీవితం కోసం వేసుకున్న బాటలో నీకెంత పరిజ్ఞానం ఉంది. రోజులో నీ జీవితం కోసం నువ్వు ఎంత సమయం ఉపయోగిస్తున్నావు, అసలు నీ అడుగులు ఎటువైపు అనేది నీకు ఒక ఆలోచన ఉన్నదా, చదువు అనేది పుస్తక పరిజ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది అంతే తప్ప లోక పరిజ్ఞానం కాదు అలాంటప్పుడు నువ్వు ఏమి చేయాలి అనేది తెలుసుకో, నీకు తెలిసిన దాని గురించి నీకే తెలుసు అనుకోడం మానివేయు ఇకనుండి ప్రతి విషయం గురించి శోచించు, అర్ధం చేసుకోడం నేర్చుకో, నలుగురు ఏమి చెప్తున్నారు అనేదాని మీద ద్రుష్టి తగ్గించి నీకేమి తెలుసు, నువేమి తెలుసుకోవాలి అనే దాని మీద నీ ద్రుష్టి మళ్ళించు, ఏ విషయం అయితే నిన్ను ఎక్కువగా కంగారు పుట్టిస్తుందో ఆలోచింప చేస్తుందో దాని కోసం ను ఎంత సమయం వ్యచ్చిస్తావో ఆ విషయం నీకు నువ్వుగా ఆలోచించుకో, ఒక నిర్ణయం నీ జీవితాన్నే మార్చేస్తుంది అని నీ నమ్మకం అయితే కనుక ఆ నిర్ణయం ఏమిటి అనేది నీకు తెలుసుకున్న దారులు నువ్వే ఎతుక్కోవాలి, నీ చుట్టూ ఉన్న వారితో కలగలిసి నీ యొక్క మేదాసేక్తిని మంచికి ఉపయోగించి అంచెలంచెలుగా ఎదగాలి, జీవితం అనే బాటలో నీకు తెలియని యుద్దాలు ఎన్ని ఎదురయినా సరే దైర్యంగా నిల్చుని వచ్చిన సమస్యకి పరిష్కారం ఆలోచించి సాధించాలని గుర్తుంచుకో.
నీలోని భయం అసలు ఎందుకు నిన్ను ఆపుతుంది :
అవును నిజమే కదా నువ్వు ఏదన్న పని మొదలు పెట్టిన తరువాత ఆ పని చేయబోతుంటే ఆదిలోనే నీ ఆలోచనని దైర్యంగా నేను చేయలేను అని అని నీకు నువ్వు నీ మనసుకి సద్ది చెప్పుకుని ఎందుకు ఆపేయాలని నీ కోరికను చంపేయాలని ఆలోచన తెచ్చుకుంటున్నావు నేస్తమా. ఒక పని చిన్నదైనా పెద్దదైన నీకు తెలియనిది అయినా లేక తెలిసినది అయినా అసలు మొదలు పెట్టాకా ఎదో సంఘటన జరిగిందని నీకు నువ్వు ఎలా ఆపేయాలని ఆలోచన కేవలం నీ భ్రమ లో నుండి పుట్టుకొచ్చిన ఈ సమాజపు ఉపయోగం లేని మాటలు విని ఇంకా ఇంతే నా జీవితం అనుకుంటూ సర్దుకుంటూ పోవడమేనా, ఇక నీ తోటి వారిలో ఎవరో ఒకరు ఎదుగుతున్నపుడు వారి వెనుక వుంది వారికి " జే జే " లు కొట్టడమేనా, మన జీవితం లో జే జే లు అవసరం లేదు, మనకి నచ్చిన పనిని మనం దైర్యంగా చేసి నలుగురికి కాకపోయినా నీతోటి వారికి ఉపయోగకరం గా ఉండేలా చేయలేమా, చేయగలము కదా అవును చేయగలము ఎప్పుడు అంటే అది కూడా ప్రతి చిన్న విషయానికి బయపడడము మానేసి ఆలోచించడం మొదలుపెట్టు, పనిని మొదలుపెట్టిన సమయానికి నువ్వు చేయలేకపోవచ్చు కానీ చేసే పని మీద నీ సమయాన్ని అలాగే నీ యొక్క ఆత్రుతని దానిపై చేఇంచు రోజు ఒక కొత్త విషయం తెలుసుకోడానికి ప్రయత్నించు, నీకు నువ్వుగా తెలుసుకునే సమయాన్ని ఆ ప్రశ్నకి ఇవ్వు, నిన్నెవరో చేతికి మాటికీ తిడుతున్నారని లేక నిరుత్సాహ పరుస్తున్నారని ఎందుకు భావించి కుంగిపోతావు మిత్రమా ఈరోజు నువ్వు చేసే పనిలోనూ నీకన్నా ముందు వారు చేసారు కాబట్టి వారు చేసిన అన్న మాటలు ఏవైనా వారికీ అనుభవం ఉందనే కదా అలా అలోచించి వారు అన్న మాటలలో నీకు ఏ విషయం అవసరం ఉన్నదో అది నీ మనసుకు తీసుకుని అనవసరం లేనిది నీకు నువ్వు దైర్యం చెప్పుకో, నీ మనసుకి తోచింది ప్రతి విషయం అలా అందరికి చెప్పుకోనవసరం లేదు అందరికి వివరించుకోవలసిన అవసరం నీకు నీ సమయాన్ని వృధా చేస్కోవడం లో మాత్రమే ఉంటుంది, కేవలం నిన్ను నువ్వు ప్రశ్నించుకో లేదా నీ సమస్యని నువ్వు తట్టుకోలేకపోతున్నావా నీ మనసుకి దగ్గరగా ఉన్నవారితో మీ బాధని పంచుకోండి, మనసుకి నచ్చినవారు అంటే ఒక్క స్నేహితులో లేక ఇంకెవరో కాదు ముఖ్యంగా తల్లి దండ్రులే కదా మనలని ప్రేమించేది ఇలా ఏదైనా సరే సమస్యని సమస్యలా చూడకండి కేవలం ఒక పరిష్కారానికి వెతికే మూలబాటలా భావించి దైర్యం గా అడుగువేయి, వేసే అడుగులు నేటికీ మూళ్ళ బాట అవ్వచ్చు నీ కష్టం, బాధ , అపరిమిత తెలివి, చదివిన చదువు, కష్ట సుఖాలలో వెన్నుండి నడిపించే నీ బంధాన్ని గుర్తుంచుకుని ప్రతి సమస్యను ఒక మెట్టుగా భావించి అడుగు వెయ్ ఆ అడుగులో సమస్యకి పరిష్కారం వెతుకుతూ సాగిపో నేస్తమా నీ జీవితానికి నిను కన్న నీ తలిదండ్రులు నీకిచ్చిన్న జీవితానికి ఒక న్యాయం చేసి నీతోటి వారికి నీ రాబోయే తరానికి నిత్యం ప్రతి నిత్యం వెలుగువై నిలిచి వారి చీకటి జీవితానికో వెలుగు బాట వేయి నేస్తమా. ఇక ఆలోచించు కేవలం నీ విజయం కోసమే గాని, పనికి రాణి అవసరం లేని భయము కోసము కాదు.
|| పనికి రాని అవసరం లేని నిను నాశనం చేసే భయాన్ని తల్చుకుని నీ జీవితాన్ని ఆపుకుంటావో
ప్రతి సమస్యని పరిష్కారం కోసం వెతికి ఎదురయ్యే కష్టాన్ని దారిలా మల్చుకుని మంచి బాట వేసుకుని విజయ కెరటం ఎగురవేస్తావో తేల్చుకో మిత్రమా ||
జయం విజయం అంతా మనదే,
|| లోఖా సమస్తా సుఖినోభవంతు : ||
@Share This



2 Comments
Nice sir...nice words....
ReplyDeleteInspirational story nice
ReplyDeletePost your valuable suggestions here