ఓ! పయనించే బాటసారి
ఓ! పయనించే బాటసారి,
క్షణామాగి సోచించు నీ అడుగుల దారెటు పోవునో,
అనగా, నువ్వు వేయు అడుగులు నిను లక్ష్యానికి చేరువ చేసునో,
లేక నీ లక్ష్యానికి బానిసని చేసి ఆశను ఎరగా వేసి కానరాని వెలుగును చూపి వారి అవసరానికి వాడుకుందునో,
నిను అనవసరపు ఎంగిలి ఇస్తరాకువలె వాడి పడేదురో..
ఈ లోకం..
ఓ బాట సారి! నా అనుకుని అడుగులేయకు ఇక్కడ బంధాలకు బంధుత్వాలకు విలువ లేని,
నిలకడ లేని రంగు కాగితాలకు తావులెన్నో ఎన్నెన్నో....
అయినా....
అలసిపోక అడుగులేసి కార్యసాధకుడివి అవుతావో
లేక ఆశల పుస్తకంలో చిరిగే పోయే పేజీవై జ్ఞాపకమై పోతావో ..
నీదే నిర్ణయం,,
ఓ! పయనించే బాటసారి,
క్షణామాగి సోచించు నీ అడుగుల దారెటు పోవునో
S.Ck✍️
ఇది చదవండి : ఆమ్మో ! మీకిది తెలుసా - మీరు తాగేది నీరా ? విషమా ? తెలుసుకోండిలా!

0 Comments
Post your valuable suggestions here