కోటి ఆశల నడుమ మరువలేని మరపు రాని కలలు కన్న లేలేత మనసు గలిగిన యువరాణిని,కానీ,
చివరకు, చెప్పుకోలేని చెప్పకూడని పని చేసుకు బతికే వ్యేభిచారిని, అయినా నేనొక ఆడపిల్లని, చీకటి బతుకుల రాజ్యానికి నేనో విలువలేని రాతి బానిసని ||
అయినా, నేను ఒక ఆడపిల్లని, అవసరానికి సంతలో దొరికే ఒక ఆట బొమ్మని, ఆడినవాడికి, వాడిన వాడికి నేనొక ప్రాణమున్న పనిచేయని మట్టి ముద్దని ||
అందచందాలు ఆరబోసినా, వలపు వయ్యారాలు వలకబోసినా పైమెరుగులు దిద్ది అప్సరసలా కనిపించినా,|
కంటికి కానరాని చీకటి బతుకుల నడుమ నలిగిపోయి, సమాజానికి అంటరాని ఆరణాల ముత్తైదువులా ఉంటిమి ||
కాదనలేము, కానీ దిన దినమున చచ్చి బ్రతుకుతూ నత్త నడకన నడిపే మా బతుకు బండ్లకు చావలేక దైర్యం చాలక కష్టనష్టాలను, ఛీదరింపులను ఎదురుకునే ఓ సాధారణ వ్యాపారవేత్తలము
ఎవరనుకున్నావు, ఓ పేరు మోసిన ఈ పాడు లోకాన్నేలే చీకటి సరసాల కోటకి పట్టపు రాణిని |
నేను మనసు చంపుకుని, నా బంధాలకు విలువనిచ్చి జీవన పోరాటం చేసే ఓ ఆడపిల్లని ||
@© S.Ck
𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘
|| శ్రీ మాత్రే నమః - శ్రీ గురుబ్యోన్నమః ||
|| మిత్రులకు గమనిక, ఈ కవిత మరియు సారాంశం, ఒక స్త్రీ తాను తన జీవితం లో ఇలాంటి స్థితికి లొంగాల్సిన పరిస్థితి దేనికి అయింది, మరియు తాము ఈ సమాజం లో ఒక మనిషిలా బ్రతకాలని ఎలా ఆశిస్తున్నారని తెలుపడానికి, అంతే కానీ మరెవరి మనోభావాలను దెబ్బతీసేందుకు రాసింది కాదని తెలియచేస్తున్నాము, స్త్రీ అంటే ఆడదే కాదు మాతృమూర్తి కూడా, అలాంటి స్త్రీ ఈ సమాజం లో చేసే పని వారు పడే ఇబ్బందులు ఎలా ఎదురుకుంటుందో, ఎందువల్ల ఇలాంటి జీవితం గడపాల్సి వస్తుందో తెలియచేసే మా ఈ చిన్న ప్రయత్నం మాత్రమే! ఏదన్న హృదయాలకు అర్దమవడము కోసమే తప్పించి నొప్పించే ప్రయత్నం కాదు. కావున చదివి అర్ధం చేసుకుంటారాని మా మనవి. "స్త్రీ" సాధికారతకు తోడ్పడదాం, స్త్రీ సమాజానికి గౌరవం ఇచ్చి వారికి తోడు నిలిచి రక్షణ కలిపిద్దాం. ||
𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘𐩘
చదివావా మిత్రమా ! అవును నువ్వు చదివింది నా జీవితం గురించే, అన్నట్లు నీకు నేను ఏదొక సందర్భంలో ఎదురయే ఉంటాను అంటే నీకు నాకు పెద్ద మొఖం పరిచయం లేకపోయినా నాలాంటి వారెందరో తమ చేతులు చాచి ఓ పలకరింపుగా పిలిచి ఉంటారు, విదితమేనా! అవును జీవితం అనే ఈ చావు బతుకుల పోరాటం లో నేను ఒక బలిపశువును, ఏంటా ఇలా అంటున్నాను అనుకుంటున్నావా, రా' ఈ రాతల దారిలో నాతో కాసేపు అడుగులు వేయు, నేను మనసారా నా అనుకుని, నా మిత్రునితో / మిత్రురాలితో కడుపు చించుకుని గుండెలు పిక్కటిల్లేలా కాస్తైనా బాధను పంచుకుని అగ్నికెరటం లాంటి నా ఈ కష్టాల బాధలనుండి కుంచమైనా విముక్తి పొందుతాను. మరి ప్రయాణం మొదలు పెడదామా!.....
మిత్రమా! నడిచే దారిలో కాస్త జాగ్రత ఎందుకంటే దారంతా నా రక్తపు కన్నీరు బాటనే, ఏదైనా ఇబ్బంది అని అనుకోకు|| ఇక మన ప్రయాణం మొదలు పెడదామా, ముందుగా నేను అనే జీవం నన్ను కన్న మా అమ్మ కడుపులో పడ్డప్పుడు నుండి మొదలైంది, నాదొక చిన్నపాటి పెద్ద ఆశల ప్రపంచం, చేతి పిక్కలకోసం రోజంతా కస్టపడి వచ్చిన అరా కొరా పైసలతో మా " అయ్య " రెక్కలు ముక్కలు చేస్కుని సంపాదించగా మా ఇంట ఇలవేల్పు అయిన మా నాన్న గారి భార్య అదే మా అమ్మ ఇంటిని చక్క దిద్దుతూ ఉన్నకాడికి వారి జీవితాన్ని సాగిస్తూ ఉన్న సమయం లో నేనొక జీవ కణం లా మా అమ్మ కడుపులో పడ్డానట, ఆ నిమిషం మా అమ్మ నాన్నల కళ్ళలోనే కాదు మనసు నిండా సంతోషం, మా నాన్నకి అబ్బాయి కావాలని కష్టపడి చదివించి మంచిగ వుద్యోగం చేయించాలని తెగ సంబరపడిపోయేవాడు అని మా అమ్మ చెప్తూ ఉండేది నేను తన కడుపులో ఉన్నపుడు, కానీ అమ్మ ఎప్పుడు పిచ్చిదే కదా కూతురు పుట్టాలని ఆశ కానీ పెళ్లి చేయాలి పెంచాలి అన్ని ఆలోచనలతో అది కాస్త మా నాన్న కోరికకి మారింది అనుకో, మా అమ్మ నాన్న రోజు ప్రతి నిమిషం ఎన్నో కబుర్లు చెప్తూ ఉండేవారు నేస్తమా నేను అబ్బాయిని అనుకుని, నేను పుట్టే సమయం రానే వచ్చేసరికి కంగుతిన్న మా నాన్న నన్ను చూసి ఏడుస్తూ చీదరించుకుని మా అమ్మని కొట్టి హింసించడం మొదలెట్టేనట, ఇలా నా బాల్యం మొదలైంది, అంతటితో నన్ను చూసిన మా నాన్న తిట్టను, కొట్టను మొదలు, నన్ను కన్న మా అమ్మ నా పరిస్థితి చూసి జాలి పడుతూ, తాను బాధపడుతూ జబ్బు చేసి నా చిన్నతనం లోనే నన్ను పుట్టించిన ఆ దేవుడిని నా క్షేమం కోరడానికి నన్ను వదిలి వెళ్ళిపోయింది, అప్పటి నుండి నా జీవిత గమనమే మారిపోయింది మిత్రమా ! అయ్యో నీ పాదాలకేమి ఇబ్బంది లేదు కదా ఎందుకంటే నా రక్తపు కన్నీటి బాటలో ఇప్పుడే అడుగుపెట్టబోతున్నావు జాగ్రత్త సుమా.
Read This Also : ఓ ప్రియతమా ! వెళ్ళాలని లేక - వెళ్ళలేక ఒక్కడినే వెళుతున్న
కదిలే కాలానికి మిగిలిపోయిన యుగం లా నా జీవితం ఓ పోరాటమనే చెప్పాలి ఎందుకంటావా, ఈ లోకం లో అందరికన్నా ముఖ్యమైన, బాధ్యత కలిగిన వారిలో తల్లితండ్రులే కదా మనకు ముందు, కానీ కాటేసిన అమావాస్య చీకటి నా జీవితం లోకి రానే వచ్చింది, ఎంతో అల్లారుముద్దుగా పెరగవలసిన నా బాల్యం "నల్ల బంగారపు మట్టి" ఇటుక బట్టీలు మోస్తూ, చీదరలు చివాట్లు వింటూ, కన్న తండ్రే కాపాడాల్సిన వాడు అతనే పరాయి మనిషై నన్ను ఓ బానిస బతుకుగా మార్చి తెలియని వయసులో వివాహ బంధమంటే ఎరుగని నా పసి మనసుకి మూడు ముళ్ళ ఉచ్చు అనే బంధాన్ని అంటకట్టి తానూ ఎదురు పిక్కలు లాభం పొంది అమ్మేయగ, నన్ను కన్న నా తల్లి ఆత్మరూపేణ గుండెలు పగిలేలా ఏడ్చే గోష నా మనసుకి తగలగా, ఏమవుతుందో అని అర్ధం చేస్కునే లోపల నా జీవితం అక్కడితో ముగిసిందని అర్ధమవుతుంది అనుకునే లోపాలు అంతా కంచికిపోయింది. అట్టహాసముగా నవ్వుల హరివిల్లు కట్టి ఆనందాల తోరణాల నడుమ జరిగిన నా వివాహం ముళ్లబాట అని నాకప్పుడు అర్దమవనే లేదు, కల్యాణ జీవనం మొదలైంది, అంతా మంచే అవుతుందని అత్తారింట కోటి ఆశలతో కుడికాలు పెట్టి నట్టింట్లో అడుగుపెట్టగా మరునాటి రోజే అంతా తారుమారైంది, మిత్రమా వింటున్నావా, ఇబ్బంది పడకు నాపై జాలి చూయించకు అడుగులు ఇబ్బందిగా ఉండవచ్చు .
చిన్ననాటి నుండి నేను కన్న కలలు, అంటే నా పెళ్ళైన నాటికీ నా వయసు 15 (పదిహేను సంవత్సరాలు), నా చుట్టూ ఉన్న అక్కలు పెద్దమ్మలు పెళ్లి గురించి తెచ్చే కబుర్లు వింటున్నప్పుడు ఒకటని కాదు ఎన్నో కలలు కంటూ, ఎన్నో ఊసులు నాలో నేను చెప్పుకుంటూ క్షణ క్షణం కలవరిస్తూ నన్ను మనువాడే నా వాడు యువరాజులా వచ్చి నన్ను పెళ్లి చేసుకుని అత్తారింటికి తీసుకుపోగా అక్కడ న వారని నేను ప్రేమ ఆప్యాయతలతో మెలగాలని కన్న కలలన్నీ ఒక్క తీరున పెళ్లి కాపురం అంటే ఎరుగని సమయాన పెళ్లి చేసేసి నా కలలన్నిటిని పగటికలలుగా మార్చిపడేశారు, ఎంతో ప్రేమని చూయిస్తారని తలచిన నా మెట్టినిలు నన్నో పనిమనిషిలా మార్చేసి అవసరానికి వాడుకునే నా పెనిమిటి గొడ్డు చాకిరి చేయించే నా అత్త ఇంటిల్లి పాటి లో ఎవరికి చెప్పలేక అన్నీ చూస్తూ మూగపోయిన మనసుతో జాలిగా చూసే మామ, ఇలా నా చుట్టూ పక్కలా ఏమవుతుందో తెలియక సతమతమవుతూ పడే బాధ నాతో నేను తప్ప మరొకరితో చెప్పాలన్నా వినేవారు లేక నలిగిపోయిన నా హృదయం నాలోనే మౌన సమాది అయిపోయింది, ఈరోజు నాకంటూ నా బాధను చెప్పుకోడానికి నువ్వు దొరికేసరికి, జీవన్మరణ పోరాటం తో నసించిపోయిన ఈ జీవితానికి కానొచ్చిన వెలుగు దారివి అయ్యావు , అందుకే వెళ్ళకక్కుతున్నాను, కుంచం ఓర్పుగా విను నేస్తమా!!
నావాడు అనుకున్న నా భర్త నేను భారమని భావించి ఇంటి ఇల్లాలు అని మరిచి అనరాని మాటలు చెప్పలేనన్ని అవమానాలు, అభం శుభం ఎరుగని నా వయసుకి నేను పడే కష్టం ఏమిటో కూడా అర్ధం కానీ నా జీవితం ప్రతి రోజు దిన దిన గండం ప్రతి రాత్రి కాళ రాత్రి అని నా ఊహకి కూడా అందనంతగా మారిపోయింది. కానీ నేను కన్న కలలు నా ముందు ఎదో జరుగుతుంది అన్న ఆలోచన మొదలైన క్షణాన నేను ఓ ప్రాణాన్ని నా గర్భం లో మోస్తున్నా అని ఎరిగాను, అయినా నాది అనుకున్న నా జీవితం ఈనాడు నాది కాదని తెలుసుకోలేక ఎప్పటికైనా నా దరి చేరుతుందని ఎన్నో ఉదయాలు వేచి చూసాను, కానీ అమావాస్య చీకటి నా జీవితం లో నిత్యం తాండవం ఆడుతూనే ఉంది, నెలలు నిండిన నాకు నెలలు త్వరపడి పస్తులు, కన్నవారు చెంతన లేక కట్టుకున్నవాడు పట్టించుకోక నా అనుకున్న నా బంధం నన్ను హేళన చేయగా ఏదారిన పోవాలో అర్ధం కాక, ఇక జీవితం కన్నీటి బాటని అర్థమయి, నవనీత నావణ్య రతనాల బంగారపు ముద్దు గుమ్మకి జన్మనివ్వగా, పుట్టింది ఆడపిల్లని, ఆ జన్మ తనకే వద్దని నన్ను మెట్టినింటనుండి బయటకీడ్చేను నా భర్త, అయినా తన జన్మకు కారణం ఒక ఆడదని మరచినట్లున్నాడేమో, యేతీరున వర్ణింపను వేసే అడుగు ఎటుపోతుందో, వచ్చిన పసి ప్రాణం ఏమవుతుందో అర్ధం కాని క్షణాన నా పుట్టింటి గూటికి చేరగా, భర్తను వదిలేసన బార్య అని ఈ సమాజం హేళన చేయగా తప్పొప్పులు కూడా ఆలోచించక సమాజాన తిరిగే చీడపురుగులు మాటేసి నా బ్రతుకును తెల్లార్చాలని ప్రయత్నించగా చుట్టూ వున్న ' రా - బందువులు ' రాబందులు కన్నా దారుణంగా పొడిచి పొడిచి చంపగా, తీసుకున్న నిర్ణయం నా దారిని, తలరాతను మార్చేశాయి..
సమాజం, అనే ఈ ముసుగులో నేను ఒక ఆట బొమ్మగా మారవలసి వచ్చింది, ఆకలికి గుండెలుపగిలేలా అలమటించి ఆకలి అని నోరారా చెప్పలేని పసికందును చూసి, నా కడుపుకోత కన్న పేగు ఓర్చుకోక వేసిన అడుగు, నేటి ఈ పాడు సమాజం రేపటి నా తరం పైన పడకూడదు, అన్న భయం, ఎటు చూసిన ఎక్కడికి వెళ్లిన మాటేసిన గుంటనక్కలే తప్పించి ఆదరించేవారు లేక, వీరు నావారే అని మనస్ఫూర్తిగా చెప్పుకునే వారు లేక తప్పించుకు తిరిగినా, ఆకలకి పస్తులున్నా, పట్టించుకున్న నాథుడే లేడు, కళ్ళు మూసుకుని కనిపించని దేవుడు కోసం కోరని రోజు లేదు, కోరని వరం లేదు, నన్ను నా బాధను చూసిన దేవుడే నా ముందుకు రాలేక గుడిలో విగ్రహమై చలించక రాతిలా మిగిలిపోయాడు, ఇక నా రాత నేనే రాయాలి, నా దారి నేనే వెతకాలి అని నిర్ణయం చేయవలసిన సమయం అయింది మిత్రమా! లోకం లో ఎది జరిగినా జరగాలన్నా బ్రతికేది సంపాదించేది పొట్టకూటి కోసమే కదా, ఎవరి దగ్గర ఏ వస్తువు వుందో అదే అమ్ముకుని బ్రతకాలి, లోకం చేసేది వ్యాపారం బ్రతుకు తెరువు కోసం అయితే మరి నేను చేసేది ఏమిటి, నా వ్యాపారం లో సుఖం, సంతోషం, కోరినంత ఉంటుంది వచ్చే పోయే యుద్ద వీరులకు నేనో "పరికరం" ఆనందాన్నిచ్చే పరికరం, నా సెరీరమే నా వస్తువు, అదే నా వ్యాపారం, ఇప్పుడు చెప్పు మిత్రమా నేను నిన్ను నిలదీయడం లేదు, సమాజానికి స్నేహితుడు అయిన నిన్ను నా తరపున ప్రశ్నిస్తున్న, ఈ సమాజం చేసేది బ్రతుకు తెరువు వ్యాపారం అయితే నేను చేసేది అదే, కానీ నాకు దక్కిన ప్రతిఫలం " వ్యెభిచారి, వేశ్య " అనే గౌరవం!!
మిత్రమా!👐 ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే నీలాంటి మిత్రుడు దొరకరు అంటారు, ఎందుకు అంటావా, నడిచే బాట కాదని తెలిసినా, వినలేని గాథ నాదని తెలిసినా, ఈ రక్తపు కన్నీటి దారిలో చిరాకు పడకుండా నాతో ప్రయాణం చేస్తూ, నా బాధను మనస్ఫూర్తిగా వింటున్నందుకు నీకు వందనం, 🙏
ఇదిగో మిత్రమా, పట్టించుకోని సమాజం, అవసరం కోసం వాడుకునే ఆశావాదులు క్షణం తీరిక లేని ఈ జనం, ఏ వక్కరూ నాకూ నా పేగు బంధంకు ఆకలి తీర్చలేదు, తీర్చాలన్న ఆలోచన లేనప్పుడు, నాది అనుకున్న నా హృదయం నశించి, చీకటి రాజ్యానికి నా సర్వస్వం అప్పగించి, గుండెలు పగిలిన రాతి రాజ్యానికి పట్టపు మహరాణినై, గతిలేక ఆకలి చప్పుడులు వినరావద్దని, చచ్చే దైర్యం లేక నేను ఈ పాడు సమాజానికి అప్సరసనై, కనికరం లేక కాలుదన్ని చీకొట్టిన ఆటబొమ్మనై, కాదనలేక అవసరానికి తప్పక తప్పటి అడుగేసి కడుపున పుట్టిన వారిని బరువుగా భావించిన తండ్రిని బాధ్యతగా స్వీకరించి వారికోసం ఈ హంగుల ఆడంబరాలు మొహానికి అలుముకుని బ్రతికున్న మనిషిగా పగటివేళ , చీకటి సమయాన రాతినై నాది కాదనుకున్న నా జీవితం ఈ చీకటి సమాజం లో గొప్పగా బ్రతికే ఈ నీచులకు అర్పించి, ఇష్టం లేని బ్రతుకు భరిస్తూ వచ్చే చావుకోసం ప్రతిక్షణం క్షణ క్షణం చచ్చి బ్రతుకుతూ మొఖాన నవ్వు అనే దానిని తగిలించుకు తిరుగుతున్నాను.
నేస్తమా! మరు విషయం, లోకంలో మేము మా అవసరాలకోసం ఈ పని చేస్తున్నామే కానీ మమ్మల్ని మించి వ్యభిచారులు అంటే ఒకరి జీవితాలు నాశనం కోరే వారు ఎందరో ఉన్నారు అలాంటి వారిని ఎందుకు ఈ సమాజం నిలతీయదు, ఆలోచించు ఒక్కసారి, నేను చేసే వృత్తి గొప్పది అని చెప్పను నేను మంచి అని కూడా నీకు చెప్పుకోవడం లేదు కానీ నా కడుపు నిండాలన్నా, నా మీద ఆధారపడి ఉన్నవారు బ్రతకాలన్నా నేను అమ్ముకోక తప్పదు మరే ఇతర దారిలేక అమ్మ అనే పదానికిబానిసనై ఈ దారి తొక్కాము, నేనే కాదు సమాజం లో ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడే మహిళలు ఉన్నారు, గొంతెత్తి అడిగే దైర్యం లేదు అందుకే బ్రతికున్న జీవత్సవము లేని శెరీరాలను అమ్ముకుంటూ బ్రతుకుతున్నాము, కానీ మిత్రమా నేను చేసే పని క్షమించరానిది అని నా మనసుకి తెలిసినా బ్రతుకు తెరువుకోసం నన్ను నేను ఈ సమాజానికి అర్పించుకున్నాను, కానీ నేను ఒక ఆడ పిల్లని, అది మాత్రం గుర్తించు.
మిత్రమా! నేను మాత్రమే కాదు నాది కాదనుకున్న నా జీవితం ఏనాడో నా చేజారిపోయింది, అలా అని నేను కుంగిపోలేదు, కానీ ఈ సమాజం నన్ను ఒక ఆడదానిని అని గుర్తించడం మానేసి అవసరానికి వాడుకుని తిరిగి నన్నే దోషిగా మార్చి హేళన చేస్తూ గుచ్చి గుచ్చి బ్రతికున్నపుడే రాబందువులు గా మారి సూటిపోటి మాటలతో నన్ను మాలాంటి వారిని పొడుస్తూ నవ్వుకునిపోతున్నారు , నేను ఈ సమాజంలో గౌరవంగా అంతస్తులు కట్టి బ్రతకాలి అనుకోడం లేదు, ఒక మనిషిగా గుర్తించి ఆడది అన్న కనికరం చూయించి, ఎదురు పడ్డప్పుడు చిరు నవ్వుతో మొహం చూసి నవ్వితే చాలు, అంతే కానీ మేము ఎవరికి ద్రోహం చేయలేదు, చేయముకూడా మిత్రమా, సాటి మనిషిగా నా అనుకుని న బాధను నువ్వు అర్ధం చేసుకుంటావు అని ఇంత సేపు నీకు నా గాదని వివరించాను, ఇది నా గురించి నేను సర్ది చెప్పుకోవడం కాదు, నా లాంటి వారి ఎన్నో గుండెల వేదనని నీకు తెలియచేయాలని చెప్తున్నాను.
ఇన్ని చేసిన , ఎన్ని ఎదురు దెబ్బలు తినినా కేవలం, మమ్మల్ని నమ్ముకున్న వారికోసం మరియు చచ్చే దైర్యం లేక బ్రతుకుని ఈడుస్తున్నాము, ఇన్ని చేసిన ఈ సమాజం లో నేను ఒక మనసున్న మనిషినే, ప్రపంచం లో చీడపురుగులు ఉన్న ఈ సమాజం లో పేరు మోసిన ఆడపిల్లనే, అన్నిటికి అన్నా నేను గర్వముగా నా పని చేసుకుపోయే ఒక "వ్యభిచారినే" కానీ గుర్తుంచుకో నేనూ ఒక ఆడపిల్లని మనసున్న మహరాణిని.
అవును నేను ఒక వ్యభిచారిని, కానీ అన్నిటికన్నా నేను ఒక జీవమున్న మనసిరిగిన ఆడమనిషిని 🚺,
|| ఇది నా జీవితం నేను చెప్పుకుని నాలో ఉన్న అగ్నిగోళాన్ని దించుకుని అతకని మనసుతో, వచ్చే ఆ చివరి క్షణాల కోసం ఎదురు చూసే ఓ బాధితురాలిని ||
|| సర్వే జనాః సుఖినోభవంతు ||
Please : READ - LIKE - SHARE - COMMENT and SUBSCRIBE
Please read this article also, to learn about water and save your family members:👇👇👇 Click
ఆమ్మో ! మీకిది తెలుసా - మీరు తాగేది నీరా ? విషమా ? తెలుసుకోండిలా!
0 Comments
Post your valuable suggestions here