"శ్వాస వదలాలన్న ఆలోచన నీదైతే ||
ఆ శ్వాస ఇచ్చిన తల్లి ప్రేమ గుర్తుతెచ్చుకో"
Do Follow & Subscribe our channel : https://nijevitam.blogspot.com/
నమ్మకమైన ప్రేమ ! ప్రేమని నమ్మి నిజమైన ప్రేమ నీదని తలచి నేలనున్న మనసు గంతేసి రివ్వున ఆకాశానకేగిన క్షణాన నిజానికి నమ్మకానికి బేధం తెలియక నీ అను వారికి భారముగా దూరమవుతూ, ప్రేమని పరిచయానికి ఇష్టమని భావించి దగ్గరవుతూ, ప్రేమ అనే రెండక్షరాల కలయిక మొదలయి ఎంతో అనందం లో మునిగి తేలే నీ మనసుకి, జోహారు.
ప్రేమ ఈ పదానికి భూమి మీదనే కాదు విశ్వం లో కాదు కాదు సృష్టిలోనే ఎక్కడ కూడా సరిఅయిన సమాధానం దొరకదు, మీకు ఆలోచన మొదలైంది కదా. అవును అదే ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను అసలు ప్రేమ అంటే ఏంటి, ప్రేమకి ఆప్యాయతకి , లేక బంధానికి నమ్మకానికి అసలు తేడా ఏమిటి మీకు ఆలోచన మొదలైందనే మాకు అనిపిస్తుంది. మీ సమాధానం మా మనసుకు చేరాలి అంటే కింద కామెంట్ లో చెప్పగలరు. ఇక విషయానికి వచ్చేద్దాం, అసలు ప్రేమ అనే రెండు అక్షరాల సమ్మెళనం ఈ ప్రపంచం లో ఒక భాషలేని రూపం దాల్చని ముసుగు కమ్మిన ఒక మాయ లాంటిది. ఎందుకంటే ప్రేమ ఇలానే ఉంటుంది అని ఎవ్వరూ స్వయానా రూపం గీసి చేయించింది లేదు కనుక.
అలాంటి ఈ రెండు అక్షరాలు ఒక ప్రాణమున్న మనిషిని నడిపిస్తుంది అంటే అది ఎంతవరకు సమంజసమో, ఇక్కడ ప్రేమని మేము తప్పుపట్టడం లేదు, అసలు నిజమైన ప్రేమ అంటే ఏమిటి అని ప్రశ్నిస్తున్నాము అంతే. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ కి మన ప్రశ్నకి సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా, వుందండి ప్రస్తుత కాలం లో మన తరాలకు ఇది బాగా వర్తిస్తుంది, ప్రేమ అనే ముసుగులో కనిపించే పైన మెరుగులు దిద్దుకుని సరదాలు సంతోషాలకు భగవంతుడు రాసిన రాత రాతే కాదని తాము నిర్ణయించుకున్న జీవితం లో ఒకరికి లేక మరెందరికో చోటు ఇచ్చుకుంటూ బేధాలు లేకుండా చీటికీ మాటికీ పడే గొడవలకు విడిపోయి మరొక స్వేచ్ఛా ప్రపంచం లో మునిగి తేలాడుతున్నారు.
సృష్టి కర్త ఆ బ్రహ్మ అయినా, ఆ బ్రహ్మని కన్నది ఒక తల్లే కదా అటువంటి ఆ మాతృమూర్తి గర్భంలో ఒక చిన్న నలుసు లా పడి, ఆ నలుసు నుండి జీవం లా మారి తొమ్మిది నెలలు పుట్టే బిడ్డ ప్రాణమే తన ప్రాణముగా భావించి క్షణ క్షణం నీ పిడి గుద్దులను తీపి అనుభూతులుగా భావించి, కదిలే నీ అలికిడికి తన పేగు బంధాన్ని నీకు రక్షగా వేసి, ప్రాణం ఉన్న శిలగా కదలక మెదలక నీ అలికిడి తాకిడికి పడే నొప్పులను సైతం మధురానుభూతులుగా నెమరేసుకుంటూ ప్రాణిగా నువ్వు భూమిమీదకి పొరలు చీల్చి ఆ తల్లి ప్రాణాలను చివరి అంచులకు చేర్చి విర్రవీగి బాహ్య ప్రపంచం లోకి అడుగిడె సమయాన ఆ తల్లి పడే వేదన ఎన్నేసి కోట్లు పోసినా దొరకనిది కదా. ఒకసారి ఆలోచించు, నీ పుట్టుక నీది కాదని అది ఒక తల్లి పెట్టిన భిక్షని.
అటువంటి ప్రేమ నువ్వు పుట్టిన క్షణం నుండి నువ్వు వేసే అడుగులు, తప్పటడుగులైనా చూసి ముసి ముసి నవ్వులతో ఆనందబాష్పాలు అనే కన్నీటిని కారుస్తూ పట్టలేని సంతోషాన్ని తానూ పొందుతూ నలుగురితో చెప్పుకుని మిక్కిలి సంతోషం తో నిను ఆకాశానికెత్తి లోకంలో నా బిడ్డకంటే సంతోషం లేదని ఎదిగే వయసుని లెక్కచేయకుండా, అకలన్న నాడు తాను కడుపు మాడ్చుకుని నీ కడుపు నింపడానికి పెట్టిన ముద్దకి నువ్వు చేసే న్యాయమెంత. అల్లరి చేష్టలు చెప్పే ముద్దు ముద్దు మాటలు, ఆడే అబద్దాలు ఒకటని కాదు ఎన్నో మరపురాని మరువలేని గుర్తులను క్షణక్షణం ప్రతిక్షణం నీ గుర్తులతో తమ కాలాన్ని సమయాన్ని నీ పై ఖర్చు చేస్తూ నువ్వేదో తమ కష్టానికి తగ్గ సంతోషాన్ని అందిస్తావని కోటి ఆశలతో ఎదురు చూస్తుంటే నువ్వేమో తెలియని మాయలో తేలాడుతూ నీది అనే ఉచ్చులో వూగులాడి నీది కానీ నీ ప్రాణాన్ని క్షణం ఆలోచన లేకుండా వారి ఆశలమీద నీరుపోసినట్లు నీ ఊపిరిని తీసేసుకోవడం వల్ల నీకేమి ఒరిగేను చెప్పు మిత్రమా! క్షణమాగు ఆలోచించు దీనిగురించి అనుకుంటున్నావా,
తెలిసి తెలియని వయసుకి పరిచయమైన ఒక తెలియని అనుభూతిని ఒకరికోసమే ఒకరు పుట్టారని ఒకరు లేకుంటే ఒకరు లేరనుకుని చిలకా గోరింకలని భావించి చెట్టాపట్టాలేసుకుని చెంగు చెంగున ఊరు వాడ చెట్టు చేమ , పుట్టా గట్టు అంటూ నీకోసం వేచి ఉండే ప్రేమని కాదని నీకోసమే ఆ దేవుడు పుట్టించిన ప్రేమని గర్వించి వేసే అడుగులు చివరాఖరికి నీ జత విడిచి దారి తప్పిన సమయాన కాలం నిను చూసి ఎక్కిరిస్తుంది అనుకుని, తిరిగిన ప్రతి దారి నిన్ను కాలానికి వెనక్కి నెట్టేస్తుంది అనే భావన లో నీది అనుకున్నది నీది కాదు అనే నిజానికి ను వచ్చినపుడు కలిగే దిగ్బ్రాంతి లో నీ ఆలోచనలు నిను నిన్నుగా నిలువనివ్వకుండా గడిచే సమయం గడపాల్సిన జీవితం నీది కాదని నీ ఎదగలేని బుర్ర నిన్ను క్షణం సమయమివ్వకుండా నీకు దూరమైన నీ ప్రేమ ఇక ప్రపంచం లో నీకెక్కడా దొరకదని, నీ అభివృధ్ధికోసం ఎదురు చూసే నినుకన్న నీ తలిదండ్రులకు అన్యాయం చేసి, నీకు దక్కని ప్రేమ కొరకు నీ జీవితం లో ఎదో పోగొట్టుకున్నాను అని అనుకుంటే ఇక బతికుండి సగం ప్రాణం తీసుకున్నంత పనే కదా, ప్రేమ అనే విషయమే కాదు, చదువులో రాణించలేకపోయినా, లేక యవరో ఎదో అన్నారని, మార్కులు రాలేదని, తల్లిదండ్రులు మందలించారని ఒకటి రెండు కాదు ఎన్నో ఎన్నెనో చిన్ని కారణాలకు ముందున్న మంచి జీవితాన్ని క్షణికావేశం లో నీకు జన్మనిచ్చి తాను చావు అంచులవరకు పోయి ను బతికితే చాలు అనుకుని నీకు జన్మనివ్వడానికి సిద్దమైన ఆ తల్లి ప్రాణం బతికుండగానే తీసినట్లే కదా మిత్రమా.
Read This Article Also : " ఓ ప్రియతమా ! వెళ్ళాలని లేక - వెళ్ళలేక ఒక్కడినే వెళుతున్న "
ఒక్క క్షణం ఆలోచిస్తే పోయేదేముంది, ప్రేమ అనేది జీవితం లో ఒక గాలికి వచ్చిపోయే మేగం లాంటిదే గాని అదే జీవితం కాదు, అలానే జీవితం లో నిన్ను వద్దు అనుకునే వారు ఉన్నపుడు ను ఉంటేనే నాకు తమకి సంతోషం జీవితం అని అనుకునే వారు ఉంటారు కదా, మనది కాదు అన్నదాని కోసం పాకులాడకుండా, మనమే కావాలి అనుకున్నవారికోసం గడిపే సమయం లో విశ్వమంతటా ఎక్కడ దొరకని సంతోషం వివరింపలేనంత మిత్రమా, ఈ సందేశం నీకు మాత్రమే కాదు, నేను మన మిత్రులు, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అని మా విశ్వాసం. ప్రేమలేని జీవితం ఎడారి ప్రయాణం లాంటిదే, అటువంటి ఎడారిలో కూడా అదృష్టం కొద్దీ ఆకలి దాహం తీర్చే సందర్భం ఉన్నట్లు, మన జీవితం లో ఎదురయ్యే కాస్త సుఖాలలో కూడా అటువంటి పరిచయాలు ప్రేమలు దానికి తగిన బాధ్యతలు ఎదురవుతూ ఉంటాయి. మనిషిగా జనమ ఎత్తడానికి ఎన్నో నీచమైన జన్మలు ఎత్తిన తరువాత వచ్చే అదృష్టం ఈ మానవ జీవితం అలాంటిది, తెలియకుండా కలిగే బాదలవలనో, సమస్యని దైర్యంగా ఎదుర్కోలేనేమో అనే అనోచిత నిర్ణయాలవలనో తెలిసి తెలియకుండా తమ జీవితాలకు ముగింపుని కొనితెచ్చుకుంటున్నారు నేటి సమాజం లోని యువత. పోతే పోయింది అనుకోడానికి జేబులోని రూపాయో లేక వస్తువో కాదు జీవితం అంటే ఆ జీవితం మీద ఎంతో మంది ప్రేమలు, ఆప్యాయతలు బాధ్యతలతో కూడిన బంధుత్వాలు, జీవితాంతం నీ అనుకుని నీతో నడిచి నీకంటూ ఒకరున్నారని దైర్యం చెప్పే నీ భాగస్వామి ఇలా ఒకటా రెండా ఎన్నో సంతోషకరమైన జీవితపు ఆనందాలను కోల్పోవడం నీకు విదితమే నా మిత్రమా !
ఆలోచించు, నేటి తరం రేపటి పౌరులకు ఆదర్శం అవ్వాలిగాని, రేపటి తరానికి నీ అనోచిత తొందరపాటు నిర్ణయాల వలన చేయకూడని పనులకోసం వారిని బలిచేయలేము కదా
లే, లేచి ఎదురీదు, జీవితం అనే పోరాటం లో కష్టాల ప్రవాహానికి బెదరక అదరక వేసే ప్రతి అడుగుని చూసి,నిన్ను హేళన చేసిన నోర్లని మూయించి, నిను నీ ప్రేమని కాదన్నా మనసుకు బుడ్డి చెప్పి, నిన్ను కాదు అన్న ఈ సమాజానికి నువ్వే ఒక ఆదర్శం అయ్యేలా నీ పరుగులు మొదలెట్టు మిత్రమా, కన్న పేగు గర్వించేలా కలకాలం కన్నవాళ్ళు కన్న కలలు మధ్యలోనే కాటి వరకు పోనీయకుండా జయవోత్సవంగ దిగ్విజయుడు లేక దిగ్విజయరాలివి అయి నేటి తరానికి బాటగా మారి రేపటి తరానికి ఆదర్శముగా నిలిచి మార్గదర్శకులుగా మారి, భయాన్ని వదిలి ధైర్యముగా ఈ కలికాలంలో మహా పురుషులై / పురుషురాలై, వేల కోట్ల ఆశలతో నిర్జీవంగా ఉన్న రాబోవు తరానికి తోడువై, నీది కాని ఈ శ్వాస నీ తల్లి దండ్రులదిగా భావించి కలకాలం వారి ఆశీసులతో విజయులై సాగిపో నేస్తమా.
|| సర్వే జనాః సుఖినో భవతు ||
.png)





2 Comments
నేటి తరానికి బాటగా మారి రేపటి తరానికి ఆదర్శ మార్గదర్శకులుగా మారి, భయాన్ని వదిలి ధైర్యముగా ఈ కలికాల మహా పురుషులై / పురుషురాలై, వేళా కోట్ల ఆశలతో బ్రతుకు నేస్తమా, నీ డి కానీ ఈ శ్వాస నీ తల్లి దండ్రులదిగా భావించి కలకాలం వారి ఆశీసులతో విజయులై సాగిపో నేస్తమా.
ReplyDeleteThanks for your comment and the correction was done.
DeletePost your valuable suggestions here