నిజమే, మీరు చూసింది నేను రాసింది, చదివేది నిజమే చదివి తెలుసుకోబోయేది ప్రతిదీ నిజమే! ఏంటా నిజం! ఎందుకా నిజం! ఎవరికోసం ?
మనిషి పుట్టేటప్పుడు ఏడుస్తూ పుట్టి , చనిపోయేప్పుడు అదే ఏడుపుతో మాత్రమే పోతాడు, దానికి కారణం మన తలరాత రాసిన ఆ దైవమే. మనకి ఏదన్న పనిలో ఆటంకం ఎదురైనా, లేక కనిపించిన దారులన్నీ వెతుకుతూ ఇక ఏ పని అవ్వక, నివ్వేరెత్తిపోయి కనిపించని శక్తి కి మన ఆశను వదిలేసి ఇక నువ్వే దిక్కు అని చేతులు దులిపేసుకుంటాం, అలాంటి జీవితం లో మనిషి తెలిసి తెలియక తనని తానే సెత్రువుగా భావించి తన జీవితాన్ని నిర్దాక్షణ్యంగ ముగించేనుకుంటున్నారు.
అసలు జీవితం అంటే ఏమిటి, ఆ అనుకోవచ్చు జీవితం అంటే సాగిపోయే రైలు బోగీలు లాంటివి ఎందుకంటే ఎన్నో దారులు, ఎంతోమంది పరిచయాలు, తమ స్థానం చేరాక ఎవరికి వారే యేమునాతీరే అయిపోయింది, ఎందుకు అంటారా ఏం జరిగిన తోడుండేవారే అయ్యో నాకేంటి నాది బాగుంది కదా అని తమ దారి వారు చూసుకుని వెళ్తున్నారు. ఆలోచించండి జీవితం అనేది ఎప్పుడు ఎలా ముగుస్తుందో ఎవరికి తెలియదు. అలాంటి నమ్మకం లేని జీవితానికి హద్దులేందుకు , ఆడంబరాలెందుకు. పరుల గురించి ఆలోచన అంటే నీకున్నదంతా ఊడ్చి పెట్టేయమని కాదు, నీకున్నదానిలో నిజంగా సహాయం కోరే చేతికి ఆసరా ఇచ్చి నేనున్నా అని చెప్పగలిగే భరోసా , దానివల్ల దుఃఖం లో ఉన్న వారికి ఒక దైర్యం కలిగేలా ఉండాలి.
నిజానికి ప్రస్తుతకాలం లో ఎవరి హడివిడి వారికి అయిపోతుంది ఎంతలా అంటే తనకేమి కావాలో తనకే తెలియనంత, గజిబిజి గోళం గందరగోళం,ఉరుకుల పరుగుల జీవితం, తెలియని ఆలోచనలు, తెలుసుకుని పడే బాధలు ,పట్టించుకునేవారు లేక పట్టించుకోవాలన్న ఆలోచన లేక ఎన్నో ఎన్నెనో బంధాలు బంధుత్వాలు మన చేయి దాటి కనుచూపుమేర కూడా మీకు మేము వున్నాము అనే స్థాయి నుండి మీకు మీరే మాకు మేమే అనే ఊహల్లో బ్రతికేస్తున్నారు. కాలానికి అనుగుణంగా మారిపోయే ఈ మానవజన్మ ఇప్పటికే ఎన్నో రకాలుగా ఎన్నో రంగాల్లో ముందున్నారు కానీ మానవత్వం అనే మర్యాదని మరచి మనుషుల్లో మంచితనం మరచి డబ్బే జీవితంగా పరుగులు తీస్తున్నారు.
మనిషి తాను గీసుకున్న గీతలోనే తన ప్రపంచాన్ని చూసేస్కుంటు బ్రతికేస్తున్నాడు, ఒక్కసారి తానూ గీసుకున్న ఆ గీటు నుండి అడుగు బయటపెడితే ప్రపంచం చిన్నదైనా ఆ ప్రపంచం లో తానుకంటూ ఒక మర్యాద, ప్రేమ, బంధం, బంధుత్వం అనే బాంధవ్యాల నడుమ నీకంటూ విలువనేర్పరిచే సమయం ఇప్పటికి మించిపోలేదు ఇకనైనా మేలుకో తగిన సహాయాం అందించు, ను నేను వెళ్ళేటప్పుడు మన మీద చిల్లర ఉండచ్చేమోగాని మన తోడు వచ్చేది ఏమి లేదు, పాప పుణ్యాలు తప్ప.
చదివిన చదువు, పెంచిన పెంపకం, నేర్పిన జ్ఞానం అనేది పది మందికి ఉపయోగపడేది అయుంటే నేడు నీనుండి వచ్చిన మొక్క అనే జ్ఞానం సంతోషం రేపు వృక్షమై వటవృక్షమై వచ్చే తరానికి మంచిని పంచి పదిమందికి ఉపయోగపడే జ్ఞానోద్యావృక్షంగా మారుతుంది. అయినప్పటికి మన నుండి మంచి జరగకపోయాయినా పర్లేదు కానీ మన నుండి ఎదుటివారికి చేడు జరగకుండా ఉంటే అదే మంచిది.
లోకా సమస్తా సుఖినోభవంతు :🙏🙏



0 Comments
Post your valuable suggestions here