నిజమేకదా ! ను చావాలి అనుకుంటున్నావా ! మంచి నిర్ణయమే తీసుకున్నావు, ఎందుకంటావా ఈ బోడి ప్రపంచం నీకేమిచిందని, నిన్ను చులకనగా చూసిందా, ను తినేది లాగేసుకుందా, నీ బ్రతుకు నేలమీద బరువైంది నీ ఊపిరి తీసుకో అని బ్రతిమాలిందా! కుంచం కఠినంగానే ఉన్నాయి కదా మాటలు, నేస్తమా నీ పుట్టుక నీ అంగీకారం కాదు, అలా అని నీ చావు నీ నిర్ణయం ఎలా అవుతుంది ఆలోచించు!
ఏమిటి ఆలోచన మొదలైందా, రా అలానే నీ ఆలోచనలో నీ పుట్టుక దగ్గరివరకు రా, తిరిగొచ్చేద్దాం మన బాల్యం నుండి. నీకు గుర్తుందా, అయినా ఎలా ఉంటుందిలే అది ను పేగుకు అంటుకున్న ఒక కణానివి కదా, అప్పుడప్పుడే ను కడుపులో పడ్డవాని మురిసిపోతూ, ను ఎదగక ముందే నీ గురించి ఆలోచన పెడుతూ నీకు సమయానికి తిండి అప్పటినుండే పెట్టే మీ అమ్మ మొహం జ్ఞాపకం తెచ్చుకో, అడుగడుగు నీ ఎదుగుదల కోసం నానా చాకిరి చేసే తండ్రి కష్టం ఒకవైపు, ఏదన్న చేస్తే లోపలున్న నీకేమి అవుతుందో అని భయంతో బ్రతికే నీ తల్లి గుండె ఒకవైపు రెండిటి ప్రేమలో ఏ ప్రేమకి వెలకడతావ్. తొమ్మిది నెలలు నీ జీవం కోసం నానా కస్టాలు పడి, ప్రాణాన్నే పణంగా పెట్టి నీ గుండెకు అదే నీ జీవానికి తన పేగు బంధాన్ని అతికించి కడుపులో నవమాసాలు మోసి గుండెలు పగిలేలా, నీ తల్లి పడే క్షోభ నువ్వు లెక్కచేయక, విరుచుకుపడుతూ నీ సమయం ఆసన్నమైందని ఆరాటపడుతూ ఈ బాహ్యప్రపంచానికి రావడానికి తొందరపడుతూ ఆ తల్లి కడుపుచీల్చినా నీకేమి కాకూడదని పడే వేదనకి వందనం. చూస్తావే నమస్కారం పెట్టు (అమ్మ కి).
గుర్తొచ్చిందా నీ పుట్టుకు ఆగమనం నీది కాదు ఆ తల్లి త్యాగం, ఇక పుట్టినప్పటినుండి బుడిబుడి అడుగుల అందాలొలికే నీ అడుగులు జీవితం లో తప్పటి అడుగులు కాకూడదని, నిత్యం నీవెంటనే వుంటూ నువ్వు ఎలా ఉన్నా ప్రపంచం లో నా కొడుకు / కూతురే మహారాజు/యువరాణి అంటూ తమ గుండెలపై తన్నించుకుంటూ చెప్పలేని మరువలేని తీపిజ్ఞాపకాలను నెమరేసుకుంటూ గడిపే ఆ ప్రేమ బానిసలకు ఏ పేరు పెట్టినా తక్కువే కదా, వయసుకొచ్చిన నీ మనసు హంగులు ఆడంబరాలు అద్దుకుంటూ నువ్వు వేసే బట్టా , తినే తిండి , పలికే మాట , నడిచే బాట ,అడుగడుగు నేడు ఆ తల్లి పెట్టిన భిక్షనే కదా నేస్తమా, మరి ఆ బిక్ష నీదికానప్పుడు నీ ప్రాణం అనుకునేదానిని ఎలా తుంచేయగలవు, అంతే కదా నీ ప్రాణం మీద నీకు అధికారమే లేదు. ఎందుకు అంటావా చూడు సగం వరకు నడిచేసాం, మిగతా సగం నడుద్దాం పదా...
అసలు ను తీసుకున్న నిర్ణయం నీకు ఎలా సరైనది అనిపించింది, తెలిసి తెలియని వయసున్న నువ్వు అడుగుపెట్టిన ఈ బాహ్య ప్రపంచం లో ఎన్నో ఆటంకాలు, సమస్యలు ఉన్నాయి నిజమే, దానికి నీ చావే మార్గం కాదుకదా, ఎవరో అన్నారని, అమ్మ నాన్న మందలించారని, ను ప్రేమించిన వారు వదిలెళ్ళారని యేవో సాకులు, ఎన్నో ఆలోచనలతో నీ చిన్ని మనసుని బాధించకు, గుర్తుంచుకో మిత్రమా , ఈ ప్రపంచం లో అన్ని ఆశలు ఒకలావుండవు, ఉండేవి కావు, సమయ సందర్బాలబట్టి మనిషి తన కాలానుగుణం మార్చుకుంటూ పరులను అవసరాలకు వాడుకుని వదిలేసి తానూ రెక్కలుకట్టుకుని ఎగిరే రోజుల్లో ఉన్నాము, దానికోసమని ను నీ దృఢమైన ఊపిరిని, అల్పప్రాణం గా వదిలేయడం వీరమరణం కాదు ను చేసేది త్యాగం కాదు, అలా అని నువ్వు చేసేది నీకు గొప్ప అని నువ్వు అనుకునే ముందు నిన్ను వదిలెళ్లిన వారి గురించి కాదు కని పెంచిన వారి గురించి ఆలోచించి చూడు ప్రపంచం లో ఆ ప్రేమకంటే మరెక్కడా నీకు దొరకని దైర్యం, జీవితం మీద ఆశని కలిగిస్తుంది.
జీవితం లో నువ్వు ఎదో కోల్పోయావు అని నీకు అనిపించినపుడు, తీసుకునే అనాలోచిత నిర్ణయానికి ముందు నీకోసం కడుపు చించుకుని గుండెలు పగిలేలా చివరి వరకు నిను ప్రేమించే వారిని బాధించకు. మనం ఏమీ చేసిన తల్లి కడుపులో పెట్టుకుని కాపాడుతుంది, తండ్రి వెనుక దాచి బాధ్యతతో బరువు మోస్తూ కాపడ్తున్నపుడు వారిని ఈ ప్రపంచమే మెచ్చుకునేది కేవలం కనిపంచే దైవాలుగా భావిస్తుంది, మనకేదన్న సమస్య వచ్చినపుడు కనిపించని రూపాన్ని దైవంగా తలచి సమస్య చెప్పుకుంటున్నపుడు, నువ్వు మదనపడే నీ బాధను కనిపించే దైవాలకు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు, శోచించు, ఆలోచించు, చింతించు కానీ అకాలపు నిర్ణయాలను ఎదురించు, నీకు ను నీ తల్లితండ్రులకు దూరమవ్వకు.
మిత్రమా ధన్యవాదములు మన ఈ ప్రయాణం లో చివరి క్షణం వరకు చేరుకున్నట్లే కానీ ఇప్పటి వరకే ఇది, జీవనం సాగే ప్రక్రియ ఆగనిది, నడుస్తూనే ఉంటుంది, ఒక్కసారి ఇంతవరకు జరిగిన మన జీవితపు ప్రయాణాన్ని మనస్ఫూర్తిగా తిరిగి మరలా జ్ఞాపకం తెచ్చుకుని నీ జీవితపు తప్పుడు నిర్ణయాలను సరిచేసుకో, మాతృదేవో భవ పితృదేవో భవ అన్న ఆ నానుడిని ఆచరిస్తూ ఆ ప్రేమకు కట్టుబడి ఉండడం నేర్చుకో.
మిత్రమా ! నేడు నీతో ప్రయాణం లో ను వేసిన అడుగులో ఇప్పటికి ఎప్పటికి తిరిగిరాని మరువలేని గుర్తులను అందించి నీతోపాటు నేను నా నీ జీవం ఏర్పడిన గురుతులు జ్ఞాపకం తెచ్చుకున్నాను, ధన్యవాదములు. ఇప్పటికైనా అర్థమైందా నీది అనుకుంటున్నా నీ దగ్గరున్న ప్రాణం నీది కాదు అని, ఒకవేళ వదిలేయాలని నిర్ణయించుకుంటే, వెళ్ళు వెళ్లి తన పాదాలు పట్టుకుని జన్మనిచ్చిన నీ తల్లి ఒడిలో పడుకుని సేద తీరు ఎందుకంటే మానవాళినే సృష్టించిన ఆ దేవుడుకూడా తన తల్లికి బిడ్డనే కదా, అదే రక్ష , అదే దైర్యం. అదే అమ్మవడి.
మిత్రమా - బలవంతపు మరణం వద్దు - ఆదర్శపు అడుగులే ముద్దు
|| సర్వేజనాః సుఖినోభవంతు! ||
ఇది కూడా చదవండి మనిషి జన్మ అపారమైనది - ఆ జన్మకు ను చేసే న్యాయం ఎంత?




0 Comments
Post your valuable suggestions here