దేహి - పుత్రా బిక్షామ్ దేహి
దేహి అనినా , నా గొంతు బిక్షామ్ దేహి అనునా ..
చేయి చాచెను నేను మెతుకుకై రోడ్డుకెక్కెను .. చూడు ,
కన్న పేగు బంధం అటకకెక్కెను నేడు .
పెంచి పెద్ద చేసిన అనుబంధం పాత వస్తువై ఓ మూలచేరెను చూడు ,
కోరిన కోర్కెలు తీర్చి తృప్తి పరిచెను నీకు ఆనాడు,
ఈ నాడు నేను ఆకలికై ఆలమటించెను చూడు..
ఆకలన్న నాడు కడుపు మాడ్చుకుని నీ పొట్ట నింపేనే..
కాలానికి చేరువైన నాకు ఈనాడు తోడు నీడా లేక ఒంటరి పక్షిని చేసివే ..
కాలమిచ్చిన రాముడని తలచినే ,, కానీ కాలయెముడివై నను కాటికి చేర్చివే ..
మరుజన్మకి నికే పుట్టాలనుకుంటినే . గతి చూసి మరు జన్మమె వద్దనుకుంటిని..
పుత్రా . . సుపుత్రా,ఆకలన్న నా కడుపును ఆలకించవే ..
కన్న పేగు బంధానికి బుద్ది చెప్తివే,
పుత్రా నా ప్రేమకు విలువలేదని తేల్చి చెప్తివే ..
ఆటబొమ్మను చేసి అమ్మతనమునే హేళన చేస్తివే..
అయినను పుత్రా భిక్షణదేహి...అను నా గొంతు నీ చేతి ముద్దకై ఎదురు చూసి మూగబోయనే.
😟🙁😭😭😢🙏

అమ్మ ప్రేమ, సాటి సామాన్యుడే కాదు, సృష్టిని ఏలే ఆ భగవంతుడు కూడా వెలకట్టలేడు, అలాంటి అమ్మ ప్రేమని మనిషిగా ఎదిగిన ఏ వక్కరు బాధించడం మంచిది కాదు కదా. మన పుట్టుక మొదలవు నిమిషం నుండి ఎదిగి జీవితం మొదలుపెట్టేంతవరకు మనకు అండ శ్రీరామ రక్షా అమ్మ కొంగేకదా. ఒంటిలో సత్తువ వున్నంతకాలం నిను కంటికి రెప్పలా కాపాడిన అమ్మ తమకి సత్తువ లేని సమయం లో నీకు భారం అని ఎందుకు అనిపిస్తుంది. సంతానం పెద్దదయి, వేలు లక్షలు కోట్లు సంపాదించి ఆఖరికి బరువు అన్న ఆలోచనతో తీసుకుపోయి ఆనాధ సెరానాలయాలలో వారికి వదిలేసి తమ బాగోగులు సంతోషం చుస్కుంటున్నాము అని గర్వపడుతున్నారేమో, మరికొంతమంది మహాను బావులు ఏకంగా రోడ్డునే పడేయడం జరుగుతుంది.
పైన రాసిన కవిత, ఎదో ఊహించుకుని రాసింది కాదు, యదార్ధ సంఘటన, ఒక తల్లి తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్న బంధం రోడ్డున ఈడ్చి, నాలుగు దారుల మధ్య ఆకలితో బిక్షాటన చేస్తున్న ఆ తల్లి వ్యధ ని మీముందు ఉంచడం జరిగింది. కేవలం ఆ తల్లి పడే వేదనే కాదు సమాజం లో ఇప్పటికి వయసు నిండిన తమ తల్లి తండ్రులను మేము బాగా చూసుకుంటున్నాము ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచి అనుకున్న మూర్కులకు మా వందనాలు. మనిషిగా పుట్టాక ఏ బంధం ఐన కోరుకునేది చివరి క్షణాల్లో తాము జీవితం లో అనుభవించిన ప్రతి కష్ట నష్టాలను తమ పిల్లలు పడకూడదని వారి కడుపు మాడ్చుకుని మన కడుపునింపే ఆ దైవ మూర్తులను, కడుపు క్షోభ పెట్టి, బతికి ఉండగానే నిర్జీవ సేవాలుగా మార్చకండి. ఎందుకంటే ఈరోజు మనం ఏదైతే మన పెద్దలకి చేస్తున్నామో, రేపు భావితరాలు అన్నీ గమనిస్తూనే ఉంటాయి, ఈరోజు వారు ,రేపు మీరు కారని నమ్మకం లేదు కదా.
మీరు నేర్పేదే భావితరాలకు బంగారు బాట, భవిష్యత్తు.
|| మాతృ దేవోభవ ||
బతికి ఉన్నపుడు చూయించలేని ప్రేమాభిమానం - కాటికి పోయాక గాలికి చలనం లేని శేరీరానికి చేయించి ఉపయోగం ఉండదు కదా మిత్రమా.
|| తల్లి తండ్రులను కనిపంచే దైవ మూర్తులుగా పూజిద్దాం
బావి తరాలకు మంచి మార్గాన నడిపిద్దాం ||
0 Comments
Post your valuable suggestions here