![]() |
| ©Change Your Water - Change Your Life : contact - 9063474744 |
"మంచి! చెడు"ఈ లోకం లో ధనికుడి నుండి పేదవాని వరకు ఏ విషయం లో అయినా ముందుగా వచ్చే మాట మంచి, చెడు చూసుకోండి అని. అసలు ఏంటి ఈ మంచి చెడులు అంటారా, జీవం మొదలు నుండి అంతరించేవరకు అన్నిట్లోనూ మంచిని ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటూ వుంటారు, అలా అని అంతా మంచే జరుగుతుంది అనుకోవడం హాస్యమే ఎందుకంటే లోకం లో మంచి ఉన్నదో చెడు నేనున్నా అంటూ జీవితం లో అడుగుపెడుతూ ఉంటుంది.
అందులోను ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి అందరికి విదితమే, అలాంటి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంటుందో, ఎలా కాపాడుకోవాలో అని ఎన్నో రకాలుగా ప్రతిఒక్కరూ లేచినప్పటి నుండి నిదురపోయేంత వరకు ఏదొకరూపాన ఆలోచించక తప్పడం లేదు, మన పెద్దలకి, ఇప్పటి జనరేషన్ కి ఎంత తేడా ఉంటుందో మీకు తెలిసినదే, అప్పటి వారికి ఇప్పటి వారికి ఏమి మారింది, ఆరోగ్యపు అలవాట్ల లేక తినే పదార్థాలు తేడా న ? అసలు ఆరోగ్యవిషయం లో ఎన్ని జాగ్రతలు తీసుకున్నా ఇన్ని అనారోగ్యాలకు ఏది దారి తీస్తుందో మీకు తెలుసా! తినే పదార్థాలే కావు తాగే నీరు కూడా ఒక కారణమే, అవును ఇది నిజం, అది ఎందుకు ఎలానో రండి తెలుసుకుందాం.
అవునండి నిజమే, నీరు మానవాళికే కాదు సమస్త జీవకోటికి ఎంత అవసరమో అందరికి తెలుసు, అలాంటిది ఆ నీరు వాళ్ళ ఎంత నష్టం జరుగుతుందో మీకు తెలుసా, వాగు నీటి నుండి బావి నీరు, బావి నీరు నుండి ట్యాప్ నీరు(మున్సిపల్ వాటర్), ట్యాప్ నీరు నుండి ఇప్పుడు బాటిల్డ్ వాటర్, అసలు ఏకాలం నుండి ఎక్కడికి మారిపోతున్నాం, మారుతున్న స్థితిగతులకు అనుగుణం గా మనము కూడా ప్రకృతికి విభిన్నంగా మారుతూ దొరికిందే తనువుగా ఈజీ పనులకు, అలవాటు పడి సంపాదనే ముందు అంటూ ఏమి తింటున్నామో ఏమి తాగుతున్నామో అని ఆలోచించక దొరికిన ముద్ద నిండిన కడుపు అనుకుని ఈ కంప్యూటర్ యుగంలో పరుగులు తీస్తున్నాం, నిజమే అంటారు కదా. కాదంటారా దానికి రుజువు మన ఆరోగ్యమే, ఒక్కనిమిషం ఆలోచించండి.
![]() |
| Know about your water : Ask Me How to TEST your Water |
ఆరోగ్యమే మహా భాగ్యం : ఆరోగ్యమే మీ, నా , మన కుటుంబాలకు శ్రీరామా రక్ష :




0 Comments
Post your valuable suggestions here