|| మన ఆరోగ్యం - మనకు నిజంగా భాగ్యమేనా ||
అవునండీ, ప్రకృతిలో దొరకనిది అంటూ ఏది లేదు, ఎన్నో యుగాలనుండి ప్రాణవాళి సహజంగా అందే "వాయువు, నీరు, ఆహారం" మొదలుకుని ప్రతిదీ ఏరికోరి మంచిదా కాదా ఆరోగ్యానికి మంచి చేస్తుందా లేక హానికరమా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటు ఉంటారు. అందులోనూ ఈ విశ్వంలోని ప్రాణులకి అన్నీ అవసరమే, మంచి నీరు, గాలి ఆహారం, నివాసం. కానీ ఇప్పుడున్న ఆధునిక సమాజంలో ఇవన్నీ సాధ్యమా, పీల్చే గాలి నుండి తినే తిండి వరకు అన్నీ కల్తీ గా మారి సమస్త ప్రాణకోటికి హానికరం కలుగచేస్తుంది, దీనివల్ల ఎవరికి ఎప్పుడు ఎలాంటి రోగాలు వస్తున్నాయో కూడా తెలియకుండా ఉంది. ఆహారం, గాలి ఒక ఎత్తైతే ముఖ్యంగా తాగే నీరు మరో ఎత్తు, ఎందుకంటారా ఆహారం మితిగా తీసుకున్న వైద్యుల సూచనల మేరకు నీరు ఎక్కువగా తాగాలి, రోజుకు మూడు(3) లీటర్ల నీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవు అని చెప్తూఉంటారు, మరియు నీటిని తీసుకునే విధానాలు పద్ధతులు చాలా రకాలుగానే ఉన్నాయి అని చెప్పాలి, కొంతమంది వేడి చేసి చల్లార్చిన నీటిని తీసుకోవడం, రాగి పాత్రలో నీటిని నిలువ ఉంచి తాగడం, మట్టి పాత్రలో నిలువ ఉంచి తాగడం, కుంతమంది ఫిల్టర్ వాటర్, మరికొంత మంది "ఆర్ ఓ" నీటిని తాగుతూ మేము ఆరోగ్యంగా వున్నాం అనే భ్రమలో ఉండిపోతున్నారు, ఇక్కడ ఏ పద్దతులను విమర్శించడం లేదు అలా అని నీటిని తాగే పద్ధతులు సరికావు అనడ ములేదు, కానీ మనం తాగే నీరు ఎలాంటివి అనేది తెలుసుకోమంటున్నాము. తాగే నీరు తినే ఆహరం మంచివే అయితే రోగాలు, వ్యాధులు ఎందుకు వస్తున్నాయి ఆలోచించండి.
నీరు! మీరు ఒకమాట అనుకోవచ్చు నీరు తాగడం కూడా చెప్పవలసిన పనేముంది మాకు తెలియనిదా అని, కానీ విషయానికి వస్తే నీటి గురించి ఎవరికి చాలావరకు తెలియదనే చెప్పాలి, ఎందుకు అంటారా, ఏదన్న విషయం మొదలుపెడితే మనం మన తాతల కాలంలో, అప్పట్లో అని మొదలు పెడతాం ఎందుకంటే అప్పటి ఆహార వ్యవస్థ, తాగే నీరు పీల్చే గాలి ఆనాటి మనుషులు ఎలా ఆరోగ్యంగా ఉన్నారో మనకు తెలుసు కాబట్టి, అదే మాట మనం మన రాబోయే తరాలకు చెప్పాల్సి వస్తే ఏది చెప్తాము ఏమని చెప్తాము చెప్పడానికి ఏమి ఉండదు ఎందుకంటే ఏది తిన్న అనారోగ్యమే ఏ నీరు తాగిన ఆరోగ్యసమస్యలే కాబట్టి. మనం మంచి అనుకున్న ఏదీ ఇప్పుడు మనకు మంచి చేయడం లేదు అందుకు కారణం కాలుష్యం, ఇలాంటి సమయాల్లో మనం ఏది ఆహారంగా తీసుకోవాలన్న , ఆఖరికి నీటిని తాగాలన్నా ప్రతీది కెమికల్స్ కలవడం వల్ల తెలియకుండానే ఆరోగ్యహీనులం అవుతున్నాము. మీరు అనుకున్నట్లు గానే మీ ఆలోచనలకు ఏకీభవిస్తాము కానీ మీరు తినే ఆహరం తాగే నీటి వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో మేము మీకు వివరిస్తాము.
త్రాగే నీరు అసలు మనకు ఎలా ఉపయోగపడుతుంది, ఎలాంటి నీరు త్రాగాలి, త్రాగే నీటిలో ఎలాంటి పోషకాలు ఉండాలి, వాటివల్ల లాభాలేమిటి, సగటు ప్రాణికి త్రాగే నీటిలో ఏ వనరులు ఉండాలి, అసలు "ఎసిడిక్" "ఆల్కలీన్" అంటే ఏమిటి, ఎలా తెలుసుకోవాలి అనేదాని గురించి తెలుసుకుందాము. మీ ఇంట్లో మీరే, మీరు తాగే నీరు ఏ నేచర్ లో ఉన్నాయో తెలుసుకోవచ్చు. అది ఎలా అంటారా, చాలా సులభం, మెడికల్ షాప్ లో దొరికే "pH" సొల్యూషన్ (ఖరీదు 20/-) ఉండవచ్చు తరువాత ఒక గాజు గ్లాసు లో మీరు తాగే నీటిని తీసుకుని అందులో మూడు నుండి నాలుగు చుక్కల మోతాదులో కలిపి చూడగా నీటి గుణాన్ని చూపిస్తుంది. పై తెలుపబడిన రంగుల ప్రకారం ఎరుపు నుండి పసుపు వరకు ఉంటే కనుక అది కచ్చితం గా విషపూరితమైన నీరు దాని వల్ల సేరీరం లో చిన్నగా "మోకాళ్ళ నొప్పులు , ఆయాసం, వూబకాయం, క్యాన్సర్ , లివర్ సమస్యలు" వంటివే కాక మరెన్నో తెలియని రోగాలకు మనం మన సేరీరం కి ఆహ్వానం ఇస్తున్నట్లే, మరియు పచ్చ రంగు నుండి బునుగు రంగు వరకు ఒక మోతాదులో పర్లేదు కానీ అది కూడా ఒకరకంగా ఇబ్బంది కలిగించే నీరే , ఇక మిగతా 9 నుండి 14 నెంబర్ వరకు ఉన్నది ఆల్కలీన్ వాటర్ ఇది కనుక మీరు తీసుకుంటే కనుక ఆరోగ్యమే మహా భాగ్యం అన్న నానుడి మీఇంట వుండి మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు సూచన.
ఇంకా మన పేజీ ని ఫాలో అయినట్లయితే మీకు నీటిగురించి మరింత వివరముగా పూర్తీ విషయాలు అందించే ప్రయత్నం చేయగలుగుతాము .
మీరు మీ నీటి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా , లైవ్ డెమో కోసం సంప్రదించండి ఎక్కడైనా మీ వద్దకు వచ్చి మీకు వివరంగా తెలుపడం జరుగుతుంది.
ఆరోగ్యమే మహా బలం , ఆరోగ్యమే మనకు శ్రీరామ రక్షా :
|| సర్వేజనాః - సుఖినోభవంతు ||
0 Comments
Post your valuable suggestions here