వెళ్ళాలని లేక - వెళ్ళలేక ఒక్కడినే వెళుతున్న
వెళ్ళాలని లేక, వెళ్ళకనే వెళుతున్న,
నేను మాత్రమే వెళుతున్న,
నాదనుకున్న నా మనసు, నీ దరి చేరి నీకు తోడైనది,
కాస్త కుసలముగా పదిలంగా చూసుకో,
నా ప్రణయమా! నా లో ఒకటైన నా ప్రాణమా🥰💑😘
నా బాట దూరమని తలవక, నిన్ను వదిలి దూరమున్నా అని నను వేరు చేయక,
నిను వదిలి!
నే కానరాని నిను చేరలేని అంతే లేని,దారే తెలియని బాటసారిలా,
మన జ్ఞాపాకలను వెన్నంటనే మోసుకెళ్తున్న,
అలకలతో కూడిన ప్రేమ సరసాలు,
ప్రేమతో కూడిన సంతోష సమయాలు,
ధైర్యం చెప్పి వెన్నుండి నను నడిపించి గెలిపించిన మౌన పోరాటాలను,
మరువకనే, అన్ని నా గుండెలో దాచుకుని వెళ్తున్నా,
చెలీ! నిన్ను మరవను నేవదిలే నా ఊపిరి ఆగేంతవరకు,
నిను వీడక తోడుండెను నీడనై సఖీ, నీ చెంత చేరేవరకు,
మన ఊసులు, ప్రేమ పలుకులు, నిత్యం నీ జాడకే నా కలవరింపులు,చెలీ
వేచి నేను వుండెనే, నీ దరి చేరి మురిపెము నీ ఒడిలోన
పసికందునై లాలి పాట విని నిదురించేవరకు.
అవును మిత్రమా, పైన ఫోటో భారత జెండా మధ్యలో ఇద్దరు వ్యక్తులు, కింద రాసిన కవిత ప్రేమ కి సంబందించిన దానిలా ఉంది రెండిటికి అసలు పొంతన లేదు అనుకుంటున్నారు కదూ! అవును మీ ఆలోచన సమ్మతమే.
ప్రేమకి బాష లేదు అంటారు, ప్రేమలో ఎన్నో బంధాలు ఉన్నాయి అది ఒక్కొక్కరి జీవితం లో ఒక్కోలా ఉంటుంది, అయితే ఈ కవితలో మేము ఎన్నుకున్నది మన భారత దేశ సైనికులు ఇండియన్ ఆర్మీ. ఎందుకంటారా మన సంరక్షణ కొరకు తమ ప్రాణాల సైతం లెక్కచేయకుండా ఒంటరి అడుగులతో వేయి జ్ఞాపాకాలతో క్షణ క్షణం ప్రతిక్షణం తాము తిరిగి తమ ఇళ్లకు సజీవంగా వస్తాం అన్న ఆలోచన వదిలి, తమ జ్ఞాపాకాలను వారి బంధాలకు వదిలి ఎన్నో తెలియని యుద్ధాలకు సిద్దమవుతు తమని తాము ఈ భారత నెల తల్లి వడిలో భావిపౌరులై చిరస్థాయిలో నిల్చుండిపోతున్నారు.
అందుకోసమే మేము రాసిన ఈ ప్రేమ కవిత తమ ఆరో ప్రాణమైన ఆలిని వదిలి వెళ్లాలని వెళ్లలేక దూరం ఉండలేక తమ వారిని ప్రతి నిమిషం జ్ఞాపకం చేస్కుంటూ తమ మురిపాలను, ముచ్చట్లను, ఆడిన ఊసులను, మరువలేని జ్ఞాపాకాలుగా కానరాని ఒక చిత్రం రూపం లో గుండెల్లో దాచుకుని, తాము పడే ఎడబాటును కనిపించే ఆ చంద్రుడికి చెప్పుకోగా పొందే సంతోషాలు ఎన్నో ఎన్నెన్నో. అలా తమలో తాము మధనపడుతూ ఎప్పుడెప్పుడు తిరిగి వచ్చి దూరమైనా ప్రతిక్షణాన్ని వేయేళ్లు మరపురాని జ్ఞాపకాలను తిరిగి పొందుతూ, తమ బంధాల ఒడిలో చంటి పాపాలై పొందు నిదుర కోసం వేచి చూడని కళ్ళు లేవని చెప్పగలమా.
|| అలాంటి అపురూపమైన ప్రేమ ఏనాటికి చేరగదు
భరతమాతకు ఇలాంటి పౌరులు కొదవలె ఉండవు ||
|| జై బోలో భారత్ మాతాకీ జై ||
|| దేశ సేవకి తమ ప్రాణమైన కొడుకును, కూతురును, ఐదోతనమైన పతిని,పత్నిని,అన్నని, తమ్ముడిని, భారత మాత కు అందించిన ప్రతి కుటుంబానికి మా పాదాభి వందనాలు ||
0 Comments
Post your valuable suggestions here