సఖా:
చిన్నారి మనసున దాగున్న దాచలేని చెప్పలేని బాదలెన్నెన్నో,
ప్రతిదినం కనుమూసి నిదరోయే సమయాన లోలోపల మనసు చేసే మౌనపోరాటాలెన్నో ఎన్నెన్నో,
ఆటలపాటల నడుమ సాగే సొగసరి మనసుకు,
బంధం బరువులంటూ ఎదురొచ్చి,
భర్తను బాధ్యత వచ్చెను,
నా ప్రాణం అనుకున్న నావాడే నా బాదెరుగక ఉండిన,
కాదనలేని అనురాగాల నడుమ చెప్పుకోలేని,
మనసారా ప్రేమ పంచుకోలేని బంధం పట్టించుకోక,
కన్నవారిని బాదించలేక,
నను నా మనసుని ఆధరించేవారు లేరని కుమిలి కుమిలి చెప్పుకోలేని బాధ, భరించలేని దానినై, కాటికి మార్గమే దిక్కని తలచి చివరి నిర్ణయాన అటుగా అడుగెడితిని!
కానీ,
అమావాస్య నాడు కమ్మేసిన చీకటి,
నా ఈ జీవితానికి ఇక బతుకులేదని,
బతుకు బాటే లేదని తలచిన సమయాన,
అనుకోని బంధమై సంతోషాల హరివిల్లువై,
మసకబారిన ఎండమావి లాంటి నా జీవితం లో కల్పవృక్షమై,
నేనున్నా పదమంటూ,
ధైర్యాన్ని ఊపిరిగా పోసి,
ముళ్లబాటని తలచిన నా జీవితానికి,
పూలబాటవై మారి, నడకే లేని నా జీవితానికి బాసటగా నిలిచి,
అడుగులేయించి,
పున్నమి చందరూఢు చిమ్మే వెలుగువై,
నిసిరాతిరి చీకటిని చిదిమేసి నాలో బతుకుపై ఆసెలు రేపావు.
మనసున దాగున్న విన్నపం నేడు నీ హృదయమునకు,
చెప్పకనే చెప్పలేక చెప్పాలని చెపుతున్న,
నా హృదయపు రాజ్యానికి నిను పట్టాభిషెక్తుడిని చేసి,
నా దైవంగా కొలిచెదను,
నీడవై నడిపించి కొండంత అండవై,
నా చిలిపి కోపాలు భరించేవాడివై,
నను ఆదరించరా,
నా చీకటి జీవితానికి వెలుగుల బాటవై నను ముందుకు నడిపించరా!
ఓ దైవమా!
నీ చేతిలో నన్ను ఆటబొమ్మని చేసి,
నువ్వు నా నుదుట రాసిన నీ గీతలకు వందనం,
నీ చిలిపి చేష్టలు, నువ్వు రాసిన మా నుదుటి రాతల మలుపులు, ఆఖరికి ను ఆడే ఆటలకు, మార్చే రాతలకు నా పాదాభివందనం..
0 Comments
Post your valuable suggestions here