అలసితిని నే అలసి సొలసి,
ఏకాకినై నీ జాడ వెతికితినే,
ఏనాడో కలగన్నాను మరి ఏమని తలవగ,
నా మహరాణివై కలల యువరానివై కానొచ్చెనే,
నా స్వప్నాన,మరి ఆనాడే నే నిశ్చయించెను,
మన ముడి త్రిముఖ బ్రహ్మ ముహూర్తాన.
అహం ఇహం ముల్లోకాలకు,
తుంబుర నారదునితో అట్టహాసముగా కబురంపితిని,
కుబేర మామకు చెప్పి మన మండపమును పసిడితో నింపమంటిని,
అరే నీ మిక్కిలి సోయగం నను నన్నుగా ఉంచనివ్వదే,
చెలీ నీ అమ్మారింట గారాబము గా ఎదిగిన నిన్ను
నా చెంత చేర్చుటకు ఇంద్రుని ఐరావతమును సిద్ధంచేసితిని,
అదని ఇదని మారాం చేయక,
పోనని నా వద్దకు రాలేనని కబురు పంపక,
పాలపుంతల వెలుగుతో నీకోసం పల్లకిని సిద్ధం చేసి,
కానరాని జాడ లేని నా స్వప్నాన నీకై ఈ విన్నపం పంపెను,
నన్ను కనుకరించి నే పంపిన పల్లకి ఎక్కోస్తావో,
లేక!
నాది ప్రేమే కాదని ద్వేషిస్తావో,
మరి నా ఆశను బలపరచి నీ అత్తారింట అడుగు పెట్టి వెలుగవతావో,
వివరింపి, మరునాడు నా స్వప్నాన కనిపించి నా కల నిజము చేయవే.
↞💘💏⇥
ప్రేమ ! ఈ మాటకు మనసులో కలిగే భావనలు వివరింపలేనివి. ప్రేమ అన్న వెంటనే మీ జ్ఞాపకం లో మీ మొదటి ప్రేమ గుర్తువచ్చిందా , హహ నిజమే నండి మీకు బయటికి చెప్పుకోలేక మనసులో తేలాడే ఆ రూపం మీకు గుర్తుకు వచ్చి మీ కళ్ళలో, పెదవులలో చిరునవ్వు మొదలైంది కదా ! అదే మరపు రాని మరువలేని ఓ తీపి జ్ఞాపకం.
ప్రేమలో ఎన్నో రకాలు వున్నవే అది అందరికి విదితమే , కానీ మనసులో ఉన్న ప్రేమ, తన మనసుకు నచ్చిన వ్యక్తితో చెప్పడానికి చేసే యుద్ధాలెన్నెన్నో, ఆ ప్రేమను తెలియపరిచే సమయం కోసం వేసే అడుగులు ఎన్నెన్నో దీనికోసం మంత్రులు, గూఢచారులు, సైనికులు,మరియు భటులు అదేంటి వీళ్లంతా ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా వస్తున్నా అక్కడికే వస్తున్నా ఇప్పుడు తెలిపిన సైన్యం అంతా మన స్నేహితులే, వచ్చాయా జ్ఞాపాకాలొచ్చాయా, మల్లి మీ పెదవులపై చిరునవ్వు మొదలైంది చూడండి.
పైన రాసిన రాతకు, చెప్పే వివరణకు అర్ధం ఏమిటా అని ఆలోచిస్తున్నారా, ఉంది అర్ధం వుంది అండి, ఇదంతా దైర్యం చేసి తమ ప్రేమని చెప్పేసి, ఒకరికోసం ఒకరు అన్నట్లు ఉన్న వారికోసం అనుకుంటే మాత్రం తప్పే, అయితే తమ ప్రేమని తమ మనసుకి నచ్చిన వారితో చెప్పుకోవాలని ఆలోచన ఉన్నా తమ మనసుకి నచ్చిన వ్యక్తి ఎవరో తెలియక సతమత మవుతున్న ఈ ప్రేమికుల కోసమే ఈ కవిత అంకితం.
ముందే వివరణ చెప్పాము కదా, ప్రతి వ్యక్తి కి తమ తమ జీవిత భాగస్వామి వారి జీవితం లోకి వచ్చేముందు ఇలా ఉండాలి అనుకుంటూ రాత్రి పగలు అనే తేడా లేకుండా పగటి కలలు కంటూ తమ భాగస్వామి కోసం ఎదురు చూస్తూ తమ కాలాన్ని గడిపేస్తుంటారు. ఇది ఇప్పటికాలం మాటేమి కాదు, తర తరాలుగా మన తాతల కాలం నుండి ఉన్నదే. కానీ ఈ ప్రేమలో మనం ప్రేమించే వ్యక్తి ఎవరో తెలియదు కానీ ఆ తెలియని అంశను మన మనసులో ముద్రించుకుని ఆ ముద్రించిన రూపాన్ని లేని అందానికి మెరుగులు మన మాటలు ఊహలను జతచేసి, తీర్చి దిద్దిన ఒక మాయలేని మరువలేని మచ్చలేని అందాన్ని చిత్రీకరించి మన భాగస్వామి తానె అయినట్లు ఊహించుకుని ఆ ఊహలలోనే తమ ప్రేయసితో ఊసులాడుతూ ఉండడం విశేషం. అటువంటి ప్రేమ నిజంలోకి వస్తే ఆ ప్రేమ దక్కినందుకు కుందరు శాశ్వత సంతోషం పొందితే మరికొందరు తమ ఊహాలోకాల్లో నిజ జీవితాన్ని గుర్తుచేసుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటారు.
ప్రేమ, పరిచయం లేని రెండు హృదయాలు తమ తోటి ప్రేమ కోసం వెతుకులాడుతూ, మనసుని కనులుగా మార్చుకుని రోజు రోజులను క్షణాలను యుగాలుగా భావించి, తమ ఊహల్లో తమకు తెలియని రూపాన్ని చిత్రీకరించుకుని తమన్ ప్రాణంగా భావించి క్షణ క్షణం ప్రతిక్షణం తాము కోరిన ప్రేమని తమదే అనుకునే తమ ప్రాణాన్ని చేరడానికి తమతో తాము చేసే ప్రయాణాలు, మనసులో పడే కాన రాని యుద్దాలు, అడుగడుగునా తమకి తాము చెప్పుకునే ఊసులు చెప్పుకుంటూ గడుపుకుంటూ బ్రతికేస్తున్నారు. ఇలా ఊహల్లో బ్రతికేస్తూ తమకోసమే ఈ భూమిపై పుట్టి తమ జీవితం లోకి అడుగిడే ఆ యువరాణి కోసం ఎదురు చూసే క్షణాలు అంతులేనివి , ఆయా మధుర జ్ఞాపాకాలు వివరింపలేనివి.
ఓ ప్రేమికులారా ! భావి భారత ప్రియమైన ప్రియ మిత్రుల్లారా లేవండి కదలండి ఊహల్లో బ్రతికింది చాలు లేచి మీ ఊహల్లో తేలాడుతున్న ఆ కానరాని తెలియని చిత్రాలను చిత్రించి అక్కడే ఆగిపోక మీ జీవితపు ప్రయాణం మొదలెట్టి, అడుగడుగునా ఎదురయ్యే కానొచ్చే యుద్ధాలను ఎదురుకుంటూ మీకోసమే ప్రాణం గా ఎదురు చూసే ఆ చిట్టి ప్రాణాన్ని చేరుకునే వరకు శోధించి సాధించు మిత్రమా. కలగా మొదలైన నీ ప్రేమ కలలోనే ఉండిపోకుండా నిజజీవితం లో నీ కళ్ళముందు ప్రాణం పోసుకుని నిను నిన్నుగా ప్రేమించే ప్రేమకోసం ఓపికతో వేచిఉండు నేస్తమా.
|| ప్రేమికుల మంత్రం - కావలి ప్రతి మనసును మార్చే తంత్రం ||
|| నిజమైన ప్రేమ వర్ధిల్లాలి ||
©S.Ck..✍️
0 Comments
Post your valuable suggestions here