ఓ భామ,
నా అందాల చందమామ,
దూరమని తలవకనే తలచి వెళ్లాలని లేకున్నా.
నా అనుకున్న నా హృదయం వీడాలని లేకున్నా,
పదిలంగా నీయందు జారవిడిచి,
ఒంటరి విహారినై వెళుతున్నా.
ప్రాణం నీవని తలచి,.
నా శ్వాస నీకై మలచి,
నా మనసుకి సర్దిచెప్పుకుని ఒంటరి బాటసారిగా పయనం మొదలుపెట్టెనే.
కానీ గుండెల భారం నను నిస్సహాయుడిని చేసినా.
కాలం చుట్టూ తిరిగి మన దూరం కరిగి నిను చేరి నీ ఒడిలోన సెదతీరెనే,
కాలం సమయం మరచి తెల్లార్లు దూరమైన రోజుల గురించి ఊసులాడెనే.
©
మాటల్లో చెప్పలేనిది, మనసుకు మరుపురానిది ఏదన్న ఉన్నది అంటే అదే ప్రేమనే చెప్పాలి, నిజమైన ప్రేమ ఏనాటికి మరువనిది మదిలో నుండి చెరుపలేనిది. అలాంటి ప్రేమలో కొన్ని విజయానికి దారితీస్తే , మరికొన్ని బంధాలకు, బాంధవ్యాలకు కట్టుపడి మనసులో ఉన్నది చెప్పలేక, ఇష్టమైనదానిని వదులుకోలేక తమని తాము చీకటి కూటమి ప్రాంచానికి మహా రాజులుగా తలచుకుని గుండెను పిండేసేంత బాధని భరిస్తూ ఇష్టం లేని ప్రపంచానికి బానిసలుగా మారుతున్నారు
ప్రేమ ! ఎప్పుడు ఎలా ఎందుకు మొదలవుతుందో తెలియదు, కానీ దానికి కారణం రాతలు రాసిన భగవంతుడే అయుండచ్చు , పుట్టి పెరిగిన తరువాత ఊహ తెల్సిననాటి నుండి ఎవరో తెలియని ఒక పరిచయం స్నేహమై, మరువలేని అనుబంధమై చివరకు వీడలేని ప్రాణం గా మారుతుంది, ఇలా రాసిన నా వక్కరికే కాదు, మీకు ఈ అనుభవాలు కలిగి ఉండడమే కాక పొందే ఉంటారు కదా. మనది అనుకున్న మన పరిచయం కాస్త మనకు మించి ప్రాణంగా భావించే ఈ ప్రేమ పరిచయం లో ఒకరికొకరు చేసిన త్యాగాలు, ప్రపంచానికి తెలియని రహస్యాలు, విశ్వానికే అంటూ చిక్కని ఊసులు , బాధైనా సంతోషమైనా ప్రేమ అనే ఈ బంధం లో మిలీనం అయి ఒకరి కోసం ఒకరము అని ఒక నిర్ణయం లో ఉండిపోతారు.
అటువంటి ప్రేమ! ఏ కారణం చేత అయినా విడిపోవాల్సి వస్తే ఇరువైపులా ఇష్టాలున్నా, ఒకరిని వదిలి మరొకరు ఉండలేకున్నా, పెంచిన ప్రేమ, కన్నా పేగు బంధానికి తలొంచి నేటి కాలం లో ఎన్నో బంధాలు వేరొక ముడి తో ముడిపడి కొత్త జీవితాలు మొదలెడుతున్నాయి. అలాంటి ప్రేమలో మేము రాసిన ఈ చిన్ని కవిత చెప్పకనే మీకు చెప్తుంది , ఇందులో రాయపడిన ప్రతి అక్షరం కుర్ర తనము నుండి ముసలి తనం వరకు లింగబేధములేకుండా ప్రతి ఒక్కరి జీవితం లో జరిగిన అనుభవాలను తెలియచేస్తూ తాము విడిచిన బంధాలను మరలా ఒక చిలిపి మరియు తీపి జ్ఞాపకంగా మీ ఆలోచనలోకి తీసుకురావడం జరుగుతుంది, ఇది చదువుతూ వున్నప్పుడే మీ ఆలోచనల్లో మీరు దూరమైనా మీ పాత జ్ఞాపకం ఊహాలోకి తేలాడుతూ వచ్చి మీ పెదవుల పైన ఒక చిన్న నవ్వు మొదలవుతుంది చూడండి! వచ్చింది కదా దానినే నిజమైన ప్రేమ మరువలేని ఒక తీపి జ్ఞాపకం గా మీ మనసులో ఎప్పటికి తేలాడుతూ ఉంటుంది.
ప్రేమ అనే ఈ రెండు మాటలు వెనుక పరిచయం,బంధుత్వం, అనే నాలుగు అక్షరాల సమ్మేళనంతో, కుటుంబం అనే మూడు అక్షరాల కలయికతో పెళ్లి అనే రెండు అక్షరాలు కలిసి మూడు ముళ్ల బంధంగా ముడిపడాలని ఆసిస్తూ ! నిజమైన ప్రేమకి చావేలేదని ప్రేమించిన మనిషి దూర బారాన వున్నా ఒకరినొకరు ప్రేమించినవారు , ఒకరినొకరు ఎప్పటికి మరువరు ! ఒకరి కోసం ఒకరి ప్రేమ ఎప్పటికి క్షేమమే కోరుకుంటుంది. అలాంటి ప్రేమకి, మరియు ఎన్నో చెప్పలేని సందర్భాల నడుమ దూరమైన మీ విలువైన ప్రేమకు మా హృదయపూర్వక జోహార్లు.
|| ప్రేమమ్ జిందాబాద్ ||
💝💝💝💝💝💝💝
|| ప్రేమికులు జిందాబాద్ ||
© S.Ck..✍️
2 Comments
Nice story
ReplyDelete💞
ReplyDeletePost your valuable suggestions here